బిగ్ బాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు చూద్దామా అని బుల్లి తెర ప్రేక్షకులు ఈ షో కోసం ఎంతగా ఎదురుచూశారో. ఇక షో స్టార్ట్ అవ్వడం జరిగిపోయింది.. చూస్తుండగానే చివరి దశకు కూడా వచ్చేసింది. ఇంకా ఉంటే మూడు నాలుగు వారాలు ఉంటుందేమో. మొత్తం 19మంది కంటెస్టెంట్స్ తో కళకళలాడిపోయిన హౌస్ ఇప్పుడు కేవలం 8 మందితో బోసిపోయింది. వీరిలో చివరికి టాప్ 5 కంటెస్టెంట్స్ మిగులుతారు.. మిగిలిన ముగ్గురు ఎలిమినేట్ అవుతారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. బిగ్ బాస్ ప్రతి ఏడాది స్టార్ట్ అవుతూనే ఉంటుంది.. ఎంతోమంది కంటెస్టెంట్స్ పోటీలో ఉంటారు.. కానీ ఎవరో ఒకరు మాత్రమే గెలుస్తారు. ఈ ఒక్క విషయం చూసే కంటెస్టెంట్ల ఫ్యాన్స్ గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. తమ కంటెస్టెంట్ ను పొగడటం కోసం వేరే కంటెస్టెంట్స్ పై విపరీతమైన ట్రోల్స్, కామెంట్స్ చేయడం ఇప్పుడు కామన్ అయిపోయింది. మరీ ముఖ్యంగా యాంకర్ రవి పై దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారు. ఇలాంటి రియాల్టీ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్‌పై ట్రోలింగ్ అనేది సహజమే. కానీ యాంకర్ రవి విషయంలో మాత్రం అందుకు విరుద్దంగా జరుగుతుంది. కొంతమంది యాంకర్ రవి ని అకారణంగా ట్రోల్ చేయడం మొదలెట్టారు.
ఇంట్లో ఉన్న కంటెస్టెంస్ట్స్ లో మైండ్ గేమర్ ఎవరంటే రవి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. టాస్కుల్లో రవి మంచి స్ట్రాటజీలను ప్లే చేస్తూ టఫ్ కాంపిటీషన్ అయితే ఇస్తాడు. రవి ఆడుతున్న ఆటకు కొన్నిసార్లు పాజిటివ్‌తో పాటు మరి కొన్నిసార్లు నెగిటివ్ ఫీడ్ బ్యాక్ కూడా వస్తుంది. కొన్నిసార్లు నువ్వు తప్పు చేసావ్ అని విమర్శించిన నాగార్జున.. ఆ తర్వాత నువ్వు సూపర్ ఆడావ్ రవి అంటూ మెచ్చుకున్నాడు కూడా. ఆటలో గెలుపోటములతో పాటు పాజిటివ్, నెగిటివ్ కూడా సర్వ సాధారణమే. కానీ ఇప్పుడు రవి ఏం చేసినా తప్పు అనే స్టేజ్ కు వెళ్లిపోయారు కొంతమంది.
మొదటి నుండి హౌస్ మేట్స్ తనకు ఎన్నో పేర్లు పెట్టినా కూడా అవేమీ పట్టించుకోకుండా అందరితో కలసి ఉంటున్నాడు. తన కామెడీతో హౌస్ లో ఎంటర్ టైన్ చేస్తున్నాడు. అయితే హౌస్ లో ఒకరి గురించి ఒకరు వెనుక మాట్లాడుకోవడం అనేది సర్వ సాధారణంగా జరిగే పనే. గేమ్స్ గురించి కానీ.. నామినేషన్ ప్రక్రియ గురించి కానీ, ఎలిమినేషన్ గురించి కానీ ఇలా అన్నివిషయాలపై డిస్కషన్ చేసుకుంటారు. కానీ రవి దగ్గరకు వచ్చే సరికి మాత్రం రివర్స్.. ఇదే విషయాలు రవి మాట్లాడితే మాత్రం ఇన్ఫ్లూయన్స్ చేసేస్తున్నాడు అంటారు. ఎవరితో ఏం మాట్లాడినా ఇన్ఫ్లూయన్స్ అని అంటుంటే.. నిజానికి రవి ప్లేస్ లో వేరే ఎవరు ఉన్నా మెంటల్ గా చాలా వీక్ అవుతారు. దానికి తోడు ప్రతివారం నామినేషన్ చేస్తారు. అయినా నామినేషన్ ఒత్తిడిని దిగమింగుకొని గేమ్‌ను గేమ్‌లా ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇక్కడ హౌస్ మేట్స్ తో పాటు ప్రేక్షకులు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే.. రవి ఇన్ఫ్లూయన్స్ చేస్తే అయిపోతున్నారు అని కేవలం రవిని తప్పుగా చూపించడానికి చేస్తున్న ప్రయత్నమే కానీ.. అంత తెలివి లేని వాళ్లు హౌస్ లో
ఎవరూ లేరన్నది అందరూ తెలుసుకోవాల్సిన నిజం.
ప్రస్తుతం అయితే రవి తో క్లోజ్ గా ఉండేవాళ్లు అందరూ దాదాపు బయటకు వచ్చేశారు. ప్రస్తుతం శ్రీరామ్ రవి ఇద్దరూ కలిసి ఉన్నా కానీ ఇద్దరూ ఎక్కువగా ఇండివిడ్యువల్ గానే ఆడతారు. దాదాపుగా ఇప్పుడు అందరి టార్గెట్ రవినే అయ్యాడు. మరి ఇన్ని వారాలు అదే గేమ్ స్పిరిట్ ఆడిన రవి ఇకపై కూడా అలానే ఆడి టైటిల్ విన్నర్ రేస్ లోకి వస్తాడేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: