
ట్యాగ్ · 11 కథనాలు


ఆర్య కెప్టెన్ మూవీ ట్రైలర్ రిలీజ్

'అంతఃపురం' ట్రైలర్ రిలీజ్

విశాల్ 'ఎనిమి' ట్రైలర్ రిలీజ్

దసరా కు రిలీజ్ కానున్న 'ఎనిమి'

విశాల్ 'ఎనిమి' టీజర్ రిలీజ్

రామ్ కు విలన్ గా..!

ఆర్య హీరోగా ఆవారా మూవీ సీక్వెల్ ?
దర్శకుడు లింగు స్వామి దర్శకత్వంలో కార్తి, తమన్నా జంటగా తెరకెక్కిన రోడ్ డ్రామా పైయా తమిళ మూవీ, తెలుగు వెర్షన్ ఆవారా మూవీ విజయం సాధించిన విషయం తెలిసిందే. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకు ఇప్పటికీ స్పెషల్ ఆడియన్స్ ఉన్నారు. అప్పుడప్పుడూ ఈ మూవీ పాటలను ఎక్కడో ఓ చోట వింటూనో, పాడుకుంటూనే ఉంటారు. దాదాపు 13 సంవత్సరాల తరువాత ఆవారా మూవీకి సీక్వెల్ చేయాలని దర్శకుడు లింగుస్వామి ప్లాన్ చేసినట్టు.. ఈ సీక్వెల్ లో కార్తీకి బదులుగా ఆర్య నటించనున్నట్టు, రీసెంట్గా కథ విన్న ఆర్య కూడా ఓకే చెప్పినట్టు సమాచారం.

కెప్టెన్ మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే కెప్టెన్ రెగ్యులర్ గా వచ్చే సినిమాలకు డిఫరెంట్ గా వచ్చిన మూవీ. ప్రయోగాత్మక సినిమాలు చూసే వాళ్లకు ఈసినిమా ఖచ్చితంగా నచ్చుతుంది.

కెప్టెన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో ఆర్య స్పీచ్
పలు సూపర్ హిట్ మూవీస్ తో తమిళ ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ హీరో ఆర్య , ఆ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. థింక్ స్టూడియోస్, ది స్నో పీపుల్ బ్యానర్స్ పై శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వంలో ఆర్య , ఐశ్వర్య లక్ష్మి జంటగా ఒక వింత జీవి పోరాటం నేపథ్యం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ కెప్టెన్ తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ మూవీ సెప్టెంబర్ 8వ తేదీ రిలీజ్ కానున్నాయి.సిమ్రాన్, హరీష్ ఉత్తమన్, కావ్య శెట్టి, గోకుల్ నాథ్ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి డి ఇమాన్ సంగీతం అందించారు. కెప్టెన్ మూవీ తెలుగు వెర్షన్ ను శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ప్రముఖ…

ఆర్య కెప్టెన్ మూవీ ట్రైలర్ రిలీజ్
పలు సూపర్ హిట్ మూవీస్ తో తమిళ ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ హీరో ఆర్య , ఆ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ వరుడు మూవీ తో ఆర్య టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. కన్నడ , మలయాళ భాష మూవీస్ లో కూడా ఆర్య నటించారు. హీరో ఆర్య ఇప్పుడు ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

ఆర్యన్ 'కెప్టెన్' మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
తమిళ్ హీరోలు ఇప్పుడు అందరూ తెలుగులో కూడా తమ సినిమాలను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఫలితాల సంగతి పక్కన పెడితే తెలుగులో కూడా తమ మార్కెట్ ను స్ట్రాంగ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కొంతమంది అయితే ఏకంగా స్ట్రైయిట్ తెలుగు సినిమాలనే తీస్తున్నారు. ఇదిలా ఉండగా ఇక ఇప్పుడు ఆర్యన్ కూడా కెప్టెన్ అనే సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నాడు. ఆర్యన్ తెలగు ప్రేక్షకులకు సుపరిచితుడే. బన్నీ వరుడు సినిమాతో తెలుగులో ప్రతినాయక పాత్రతో ఎంట్రీ ఇచ్చాడు ఆర్యన్. అయితే ఆ తరువాత తెలుగులో పెద్దగా సినిమాలు చేసింది లేదు. అయితే రాజా రాణి డబ్బింగ్ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా…

'అంతఃపురం' ట్రైలర్ రిలీజ్
సుందర్ సి. తమిళంలో 'అరణ్మనై' టైటిల్ తో వరుస సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటి వరకూ 'అరణ్మనై1', 'అరణ్మనై2' సినిమాలు వచ్చాయి. తెలుగులో కళావతి, చంద్రకళ టైటిల్స్ తో ఈసినిమాలు రిలీజ్ అయ్యాయి. హార్రర్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు కాబట్టి రెండు సినిమాలు కూడా మంచి విజయాన్నే దక్కించుకున్నాయి. ఇక ఇప్పుడు ఇదే సిరీస్ లో భాగంగా 'అరణ్మనై 3' సినిమా కూడా వస్తుంది. ఆర్య, రాశీఖన్నా ప్రధాన పాత్రల్లో ఈసినిమా వస్తుంది. ఇక ఈసినిమాను కూడా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో 'అంతఃపురం' టైటిల్ తో విడుదల అవుతుంది.

విశాల్ 'ఎనిమి' ట్రైలర్ రిలీజ్
హిట్లు ఫ్లాప్‌లతో సంబంధంలేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు తమిళ్ స్టార్ హీరో విశాల్. ఇప్పటికే బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఎనిమి సినిమా కూడా ఒకటి. విశాల్, ఆర్య ప్రధాన పాత్రల్లో ఆనంద్ శంకర్ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఎనిమి’. వాడు వీడు సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. ఇక ఈసినిమా ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. అంతేకాదు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఎప్పటినుండో చిత్రయూనిట్ మొదలుపెట్టింది కూడా. దీనిలో భాగంగానే ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ మూవీపై భారీ అంచనాలను పెంచేసింది. ఇక ఇప్పుడు…

విశాల్ 'ఎనిమి' డబ్బింగ్.. ఫైనల్ స్టేజ్ లో పోస్ట్ ప్రొడక్షన్
ఆనంద్ శంకర్ దర్శకత్వంలో విశాల్, ఆర్య హీరోస్ గా వస్తున్న సినిమా ఎనిమి. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది. ఇక తాజాగా విశాల్ ఈసినిమా తెలుగు డబ్బింగ్ చెబుతున్నవీడియో ఒకటి తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశాడు. అంతేకాదు తెలుగులో డబ్బింగ్ చెబుతుంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ లాగా చేస్తున్నట్టు ఉంది అంటూ తన మీద తానే కామెంట్ వేసుకున్నాడు.

దసరా కు రిలీజ్ కానున్న 'ఎనిమి'
ఆనంద్ శంకర్ దర్శకత్వంలో విశాల్, ఆర్య హీరోస్ గా ఎనిమి సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక ప్రస్తుతం అందరూ సినిమాలు రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ఈసినిమాను కూడా త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలన్నప్లాన్ లో ఉన్నారు మేకర్స్. ఈనేపథ్యంలోనే రిలీజ్ ఎప్పుడో ప్రకటించారు. డేట్అయితే చెప్పలేదు కానీ దసరాకు ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్.

విశాల్ 'ఎనిమి' టీజర్ రిలీజ్
వాడు వీడు సినిమాలో కలిసి నటించిన విశాల్ ఆర్య ఇన్నాళ్లకు ఈ ఇద్దరూ కలిసి మరో సినిమాలో కనిపించబోతోన్నారు. విశాల్, ఆర్య హీరోస్ గా ఎనిమి సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా హైద్రాబాద్‌లోనే ఎక్కువ శాతం షూటింగ్ జరుపుకుంది. ఇక ఈసినిమా ప్రమోషన్స్‌ను కూడా స్టార్ట్ చేసింది. దీనిలోభాగంగానే తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

రామ్ కు విలన్ గా..!
ఒకప్పుడు చాక్లెట్ బాయ్ లా కనిపించిన రామ్ ఈ మధ్య ఫుల్ మాస్ హీరోగా మారిపోయాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో మాస్ క్యారెక్టర్ లో అలరించిన రామ్.. ఆ తర్వాత వచ్చిన రెడ్ సినిమాలో కూడా అదే కంటిన్యూ చేసాడు. ఇప్పుడు ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ‘రాపో 19’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. నిన్నటి నుండి ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టింది. ఇక ఇప్పటికే ఈసినిమాకు 'ఉస్తాద్' అనే పేరును చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈసినిమాలో నటించే విలన్ గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. గతంలోనే తమిళ్ స్టార్ హీరో మాధవన్ హీరోగా నటిస్తున్నాడని…