
ట్యాగ్ · 12 కథనాలు


అల్లరి నరేష్ 63 మూవీ ప్రారంభం

సుడిగాడు 2 కథ రాస్తున్నా-అల్లరి నరేష్

మళ్లీ కామెడీ లైనప్ తో అల్లరి నరేష్

ఉగ్రం సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

నరేష్ ఉగ్రం హీరోయిన్ ఫిక్స్

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం టీజర్ రిలీజ్

'నాంది' డైరెక్టర్ తో నరేష్ మరోసారి..!

స్కూల్ టీచర్ గా మారనున్నఅల్లరి నరేష్..!

అల్లరి నరేష్ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం..!

12 A రైల్వే కాలనీ టీజర్ రిలీజ్
బచ్చల మల్లి తరువాత అల్లరి నరేష్ 12A రైల్వే కాలనీ అనే హారర్ థ్రిల్లర్ తో రానున్నాడు.పొలిమేర, పొలిమేర 2 చిత్రాలతో పాపులరైన డాక్టర్ అనిల్ విశ్వనాథ్, ఈ ప్రతిష్టాత్మక వెంచర్‌కు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తుండగా ఈ చిత్రాన్ని ప్రఖ్యాత నిర్మాణ సంస్థ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. పవన్ కుమార్ సమర్పిస్తున్నారు.

అల్లరి నరేష్ 63 మూవీ ప్రారంభం
అల్లరి సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తరువాత వరుసగా కామెడీ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నాడు అల్లరి నరేష్. ఇప్పుడు కాస్త తన పంథాను మార్చి విభిన్నమైన పాత్రలు చేస్తున్నాడు. ప్రస్తుతం తను బచ్చలమల్లి అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈసినిమాలో కూడా నరేష్ మల్లి అనే మాసీ పాత్రతో రానున్నాడు. ఇక ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. నరేష్ సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించనున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం.. రిచర్డ్ ఎం నాథన్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.

బచ్చలమల్లి నుండి అల్లరి నరేష్ ఫస్ట్ లుక్ రిలీజ్
ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలతో అలరించాడు అల్లరి నరేష్. సంక్రాంతికి నా సామిరంగ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈసినిమా డీసెంట్ హిట్ నే అందించింది. ఆ తరువాత ఆ ఒక్కటీ అడక్కు అనే సినిమాతో వచ్చాడు. ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాతో వచ్చేస్తున్నాడు. సుబ్బు మంగదేవి దర్శకత్వంలో నరేష్ హీరోగా వస్తున్న సినిమా బచ్చలమల్లి. 1990 బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ డ్రామా పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది.

సుడిగాడు 2 కథ రాస్తున్నా-అల్లరి నరేష్
అల్లరి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సినిమా టైటిల్ నే ఇంటిపేరుగా మార్చుకున్నాడు అల్లరి నరేష్. ఆ తరువాత కామెడీ సినిమాతోనే ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఈమధ్య నాంది, ఉగ్రం లాంటి సీరియస్ కథలతో మెప్పించి ఇప్పుడు మళ్ళీ కామెడీ సినిమాతో వస్తున్నారు. మల్లి అంకం దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఆ ఒక్కటీ అడక్కు అనేే టైటిల్ తో కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రూపొందుతుంది. మే 3వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ పనులతో బిజీగా ఉంది.

మళ్లీ కామెడీ లైనప్ తో అల్లరి నరేష్
ఒకప్పుడు కామెడీ కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన అల్లరి నరేష్ ఇప్పుడు పాత్ర ప్రధానమైన సినిమాలు చేయడానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. చాలా కాలం సరైన హిట్ లేక బాధపడుతున్న అల్లరి నరేష్ మహేష్ మహర్షి సినిమాలో మంచి రోల్ చేసి ప్రశంసలు దక్కించుకున్నాడు. ఇక ఈమధ్య అల్లరి నరేష్ సీరియస్ కథలనే ఎంపిక చేసుకుంటున్న సంగతి తెలిసిందే కదా. నాంది సినిమా సీరియస్ మోడ్ లోనే ఉంటుంది. అలానే ఈమధ్య వచ్చిన ఇట్లు మారేడిమిల్లి ప్రజానీకం సినిమా కూడా మెసేజ్ ఒరియెంటెడ్ సినిమానే. ప్రస్తుతం తను ఉగ్రం సినిమా అలానే సభకు నమస్కారం సినిమాలు చేస్తున్నాడు. ఇందులో ఉగ్రం సినిమా ఫుల్ యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ అని ఇప్పటికే రిలీజ్…

ఉగ్రం సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
నాంది సినిమా తరువాత అల్లరి నరేష్ తన రూట్ ను మార్చారు. ఇప్పుడు విభిన్నమైన కథలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ప్రస్తుతం అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఉగ్రం’. ‘నాంది’ వంటి సూపర్ హిట్ తర్వాత ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రమిది. ఇందులో అల్లరి నరేష్ ఫెరోషియస్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.

నరేష్ ఉగ్రం హీరోయిన్ ఫిక్స్
ఇంతకుముందు కామెడీ సినిమాలతో అలరించిన అల్లరి నరేష్ ఇప్పుడు పాత్ర ప్రధానమైన సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ప్రస్తుతం అయితే రాజ్‌మోహన్ దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా చేస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈసినిమా కూడా డిఫరెంట్ కథతో తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండ ఈసినిమాను నిర్మిస్తున్నారు.

"ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం" మూవీ టీమ్ తో బాలకృష్ణ
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో యాక్షన్ ఎంటర్ టైనర్ “#NBK 107 “మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “#NBK 107 “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ,ఫస్ట్ హంట్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం టీజర్ రిలీజ్
గతంలో వరుసగా కామెడీ సినిమాలతో అలరించిన అల్లరి నరేష్ ఇప్పుడు రోటీన్‌కు భిన్నంగా సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. దీనిలో భాగంగానే గతేడాది ‘నాంది’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కామెడీని పక్కన పెట్టి మొదటి సారి పూర్తి స్థాయిలో నరేష్ ఈ చిత్రంలో సీరియస్ రోల్ పోషించాడు. ఈసినిమాలో నరేష్ నటనకు గాను మంచి ప్రశంసలు దక్కాయి. ఇక ఇప్పుడు మరో కథతో వచ్చేస్తున్నాడు. రాజ్‌మోహన్ దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా వస్తున్న సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను అలానే రెండు రోజుల క్రితమే ఈసినిమా నుండి ప్రీ టీజర్ ను…

'నాంది' డైరెక్టర్ తో నరేష్ మరోసారి..!
కామెడీ ఎంటర్ టైనర్ సినిమాలతోనే ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిన అల్లరి నరేష్ ఇప్పుడు తన రూట్ మార్చేశాడు. ప్రస్తుతం ప్రేక్షకులు కూడా ప్రయోగాత్మక సినిమాలనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు కాబట్టి ఆ దిశగానే అడుగులు వేస్తున్నాడు. ఆ క్రమంలోనే నాంది లాంటి సినిమాతో తన రీఎంట్రీకి నాంది పలికాడు. ప్రస్తుతం అయితే రాజ్‌మోహన్ దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా వస్తున్న సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈసినిమా కూడా డిఫరెంట్ కథతో తెరకెక్కుతుంది.

స్కూల్ టీచర్ గా మారనున్నఅల్లరి నరేష్..!
కామెడీ సినిమాలతోనే టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు అల్లరి నరేష్. మొదటి నుండి కామెడీ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చాడు. అయితే ఇటీవల కాస్త ఆడియన్స్ టేస్ట్ కూడా మారడంతో తన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయాయి. ఇక ఇప్పుడు తను కూడా తన పంథాను మార్చాడు. మహర్షి సినిమాలో మహేష్ కు ఫ్రెండ్ గా చేసి మంచి పేరును తెచ్చుకున్నాడు. ఆ తరువాత నాంది లాంటి సినిమాలో ఛాలెంజింగ్ రోల్ లో చేసి మెప్పించాడు. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు.

అల్లరి నరేష్ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం..!
అల్లరి నరేష్ కూడా ఇప్పుడు తన రూట్ ను మార్చేశాడు. రొటీన్ కథలను పక్కన పెట్టి కాస్త డిఫెరెంట్ గా చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఈనేపథ్యంలోనే ఇప్పటికే నాంది లాంటి డిఫరెంట్ స్టోరీతో వచ్చి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు. ప్రస్తుతం మల్లంపాటి సతీష్ దర్శకత్వంలో అల్లరి నరేష్ సభకు నమస్కారం అనే సినిమా చేస్తున్నాడు. ఈస్ట్ కోస్ట్ బ్యానర్ పై మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రానికి అబ్బూరి రవి సంభాషణలు సమకూరుస్తున్నాడు.