ట్యాగ్ · 11 కథనాలు
గుడ్‌బై 'వైల్డ్‌డాగ్' - చాలా బాధగా ఉంది
యాక్షన్ సీన్స్ లో నాగార్జున
'హిమాలయాల్లో' వైల్డ్ డాగ్ - 3980 మీటర్ల ఎత్తులో షూట్

నాగార్జున "వైల్డ్ డాగ్ "మూవీ అప్ డేట్
కరోనాను ఎదుర్కోవాలంటే అదే సరైన మార్గం..!
నాగార్జున స్వీట్ మెమొరీ
"బంగార్రాజు " మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ ?

సినీ కార్మికులకు 'కింగ్' సాయం
హీరో నాగార్జున పై సయామీ ఖేర్ ప్రశంసలు
మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ "వైల్డ్ డాగ్ " మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుంది. హీరో నాగార్జున ఎన్ఐఎ ఆఫీసర్ గా నటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న "వైల్డ్ డాగ్ " మూవీ 2021 సంవత్సరం ప్రథమార్థం లో రిలీజ్ కానుంది. ఈ మూవీలో దియా మీర్జా , సయామీ ఖేర్ , అతుల్ కులకర్ణి ముఖ్య పాత్రలలో నటించారు.
గుడ్‌బై 'వైల్డ్‌డాగ్' - చాలా బాధగా ఉంది
అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో ప్రస్తుతం కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కోసం హిమాలయాస్ కు వెళ్లిన సంగతి తెలిసిందే కదా. ఇన్ని రోజులు హిమాచల్ ప్రదేశ్‌లో మనాలీలో షూటింగ్ జరుపుకుంది. అక్కడికి వెళ్ళినప్పుడే నాగ్ దాదాపు మూడు వారాలపాటు షూటింగ్ జరుపుకోనున్నట్టు తెలిపిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. ఇక చెప్పినట్టే తన షూటింగ్ ను పూర్తిచేసుకున్నాడు. ఇక ఈ విషయాన్ని నాగ్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. "వైల్డ్‌డాగ్‌లో నా పాత్ర చిత్రీకరణ ఈరోజుతో పూర్తయ్యింది. ఇంటికి బయలుదేరాను. నా టాలెంటెడ్ టీమ్‌కు, హిమాలయాస్‌కు గుడ్‌బై చెబుతున్నందుకు చాలా…
యాక్షన్ సీన్స్ లో నాగార్జున
మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అషిషోర్ సాల్మన్ దర్శకత్వంలో నాగార్జున హీరో గా వాస్తవ సంఘటనల ఆధారంగా యాక్షన్ థ్రిల్లర్ "వైల్డ్ డాగ్" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. దియా మీర్జా , సయామీ ఖేర్ కథానాయికలు. హీరో నాగార్జున ఎన్ఐఎ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ లో అతుల్ కులకర్ణి , అలీ రెజా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. లాక్ డౌన్ కు ముందు "వైల్డ్ డాగ్" మూవీ 70శాతం షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకుంది.
'వైల్డ్ డాగ్' - నాగ్ కోసం స్టంట్స్ కంపోజ్ చేస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో తండ్రి
ప్రస్తుతం కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ లో ఉన్నసంగతి తెలిసిందే. అహిషోర్ సాల్మన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే స్టార్ట్ అయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా కోసం హిమాలయాలకు వెళ్ళింది చిత్రయూనిట్. ఈ సినిమా తాజా షెడ్యూల్ హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీలో మొదలైంది. దాదాపు మూడు వారలు అక్కడే నిర్విరామంగా షూటింగ్ చేసుకోనున్నారు. సుదీర్ఘంగా కొనసాగే ఈ షెడ్యూల్లో నాగార్జునతో సహా ప్రధాన పాత్రధారులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
'హిమాలయాల్లో' వైల్డ్ డాగ్ - 3980 మీటర్ల ఎత్తులో షూట్
ప్రస్తుతం కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా ఎప్పుడో మొదలైంది. ఈపాటికి రిలీజ్ కూడా అవ్వాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల లేట్ అయితే కరోనా వల్ల మరింత లేట్ అయింది. ఇక ఇటీవలే షూటింగ్ ను మళ్లీ స్టార్ చేశారు. ఇక ఇన్ని రోజులు ఇక్కడే చిత్రీకరణ జరుపుకున్న చిత్రబృందం ఇప్పుడు ఈ సినిమా కోసం హిమాలయాలకు వెళ్లినట్టు తెలుస్తుంది. ఇక అక్కడకు వెళ్లిన నాగ్ ఈ విషయాన్ని తన ట్విట్టర్ లో వీడియో ద్వారా తెలిపారు.

నాగార్జున "వైల్డ్ డాగ్ "మూవీ అప్ డేట్
తమిళ సూపర్ స్టార్ , తలైవా ఆధ్యాత్మిక చింతనతో తరచూ హిమాలయాలకు వెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు హీరో నాగార్జున షూటింగ్ కై హిమాలయాలకు వెళ్ళారు. కరోనా కారణంగా స్టార్ హీరోస్ సుమారు 7నెలలు ఇళ్ళకే పరిమితం అయ్యారు. 60 సంవత్సరాల నాగార్జున ధైర్యం గా షూటింగ్స్ లో పాల్గొనడం విశేషం. బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షో సీజన్ 4 కు నాగార్జున హోస్ట్ గా ఉన్నారు. కంటిన్యూ గా బిగ్ బాస్ షూటింగ్ లో పాల్గొంటున్న నాగార్జున ఇప్పుడు "వైల్డ్ డాగ్ "మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.
కరోనాను ఎదుర్కోవాలంటే అదే సరైన మార్గం..!
లాక్ డౌన్ లో సడలింపులు చేసిన తర్వాత రోజు రోజుకు కరోనా కేసులు పెరుతున్న సంగతి తెలిసిందే. మునుపటికంటే ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇక ఈ నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలంటూ ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీస్ పిలుపు నివ్వగా ఇప్పుడు తాజాగా కింగ్ నాగార్జున కూడా పలు సూచనలు చేశారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా కరోనా సమర్థవంతంగా ఎదుర్కొవాలంటే మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండటమే ప్రతి ఒక్కరికి ప్రధాన అయుధమని వివరించారు. మా ఫ్రెండ్ శిల్పా రెడ్డి, ఆమె భర్త కరోనా బారిన పడ్డారని, అయితే వారు కరోనా విజయవంతంగా జయించారిన వెల్లడించారు. అంతేకాదు శిల్పా రెడ్డి వీడియో ఒకటి షేర్ చేశారు నాగార్జున. ఆ…
నాగార్జున స్వీట్ మెమొరీ
బాక్స్ ఆఫీస్ హిట్ "విక్రమ్"(1986 ) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన నాగార్జున మూడున్నర దశాబ్దాలుగా అనేక సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. దర్శకుడు కృష్ణ వంశీ దర్శకత్వంలో నాగార్జున హీరో గా నటించి, నిర్మించిన "నిన్నే పెళ్ళాడతా " మూవీ బెస్ట్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్ అందుకుంది. బ్లాక్ బస్టర్ "అన్నమయ్య "మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నాగార్జున బెస్ట్ యాక్టర్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ స్వంతం చేసుకున్నారు.
"బంగార్రాజు " మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ ?
అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "సోగ్గాడే చిన్ని నాయనా " మూవీ 2016 సంవత్సరం సంక్రాంతి పండుగకు రిలీజ్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ తో ఘనవిజయం సాధించి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. "బంగార్రాజు "క్యారెక్టర్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నాగార్జున ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు ఆమూవీ కి సీక్వెల్ రూపొందనుంది.

చిరు గారు అండగా ఉంటే సరిపోదు.. యాక్షన్ ప్లాన్ కావాలి..!
కిల్ ఫేక్ న్యూస్ అంటూ విజయ్ దేవరకొండ స్టార్ట్ చేసిన వీడియోకు మంచి స్పందనే వచ్చింది. మధ్యతరగతి కుటుంబాలకు సహాయం అందించేలా విజయ్ దేవరకొండ 'ది దేవరకొండ ఫౌండేషన్' స్థాపించి 'మిడిల్ క్లాస్ ఫండ్ పేరుతో సహాయక కార్యక్రమాలు చేపట్టగా దానిపైనా పలు వార్తలు వచ్చాయి. తనపై వచ్చిన వార్తలను ఖండిస్తూ విజయ్.. ఫేక్ న్యూస్ రాసిన వారిపై మండిపడ్డాడు.

సినీ కార్మికులకు 'కింగ్' సాయం
కరోనా ఎఫెక్ట్ పలు పరిశ్రమలపై బాగానే పడింది. ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయి. ముఖ్యంగా సినీ పరిశ్రమపై ఈ ఎఫెక్ట్ బాగా పడింది. హీరోలు, హీరోయిన్స్ ఇంట్లోనే వుండండి... బయట తిరగకండి.. కరోనాను తరిమికొట్టండి అంటూ సూచనలు ఇస్తున్నారు. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉంది. వీళ్లకు ఆర్థికంగా ఎలాంటి సమస్య లేదు కాబట్టి ఇంకో రెండు మూడు నెలలు ఇలానే వున్నా వాళ్లకు పెద్ద ప్రాబ్లమ్ లేదు. కానీ సినీ కార్మికులకు మాత్రం ఇది పెద్ద సమస్యనే. షూటింగ్‌లు రద్దవ్వడంతో సినీ కార్మికులకు ఉపాధి కరువయింది. పేద సినీ కార్మికులకు కష్టంగా మారింది.