
ట్యాగ్ · 10 కథనాలు


ఆదిత్య 999- త్వరలో లాంచింగ్ ప్లాన్?

బ్లాక్ బస్టర్ సీక్వెల్ పై బాలకృష్ణ క్లారిటీ

టాలీవుడ్ కు మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ

30 వసంతాల "ఆదిత్య 369"

29 వసంతాల "ఆదిత్య 369 "
'ఆదిత్య 369' సెట్స్ నుండి .. ఆనాటి జ్ఞాపకాలు.. !
ఆ సినిమా తర్వాతే 'ఆదిత్య 369' సీక్వెల్..!

ఆదిత్య 369 రీ-రిలీజ్ డేట్ ఫిక్స్
లెజెండరీ యాక్టర్ నందమూరి బాలకృష్ణ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్, కమాండింగ్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు చిరునామా. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ సైన్స్ ఫిక్షన్ 'ఆదిత్య 369' NBK ఐకానిక్ చిత్రాలలో ఒకటి. శ్రీ కృష్ణ దేవరాయలుగా బాలకృష్ణ పాత్ర ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసింది. బాలయ్య సరసన మోహిని కథానాయికగా నటించగా, అమ్రిష్ పురి, టిన్ను ఆనంద్, అన్నపూర్ణ, సుత్తివేలు, శ్రీలక్ష్మి, మాస్టర్ తరుణ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

రీరిలీజ్ అవుతోన్న బాలయ్య ఆల్ టైమ్ కల్ట్ క్లాసిక్
టాలీవుడ్‌లో కొన్నేళ్లుగా రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో సూపర్ హిట్ అయిన స్టార్ హీరోల సినిమాలను నేటి జెనరేషన్ ఆడియెన్స్ కోసం మరోసారి థియేటర్లలోకి తీసుకొస్తున్నారు మేకర్స్. అయితే ఈ చిత్రాలకు లేటెస్ట్ టెక్నాలజీని జోడించి ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్ అందిస్తున్నారు. ఇది నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పుడు ఈ లిస్టులోకి ఓ క్రేజీ మూవీ చేరింది.

ఆదిత్య 999- త్వరలో లాంచింగ్ ప్లాన్?
టాలీవుడ్ లో అగ్రహీరోలు కూడా యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. అందులో బాలకృష్ణ వరుసగా సినిమాలను లైన్ లో పెట్టుకుంటూ వెళుతున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి సినిమా చేస్తున్నాడు. ఈసినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇక ఈసినిమా తరువాత కామెడీ ఎంటర్ టైనర్ లు తీయడంలో ఎక్స్ పర్ట్ అయిన అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నాడు. బాలకృష్ణ కోసం ఇప్పటికే సాలిడ్ కథను రెడీ చేసే పనిలో ఉన్నాడు అనిల్ రావిపూడి. ఇక వీటితో పాటు మరో ప్రాజెక్ట్ ను కూడా బాలకృష్ణ సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తుంది. ఆ సినిమా మరేదో కాదు ఆదిత్య 369 సీక్వెల్…

బ్లాక్ బస్టర్ సీక్వెల్ పై బాలకృష్ణ క్లారిటీ
ప్రయోగాల దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు చేసిన ప్రయోగమే ఆదిత్య 369. టైమ్ మెషీన్ బ్యాక్ డ్రాప్ తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వచ్చిన తొలి తెలుగు సినిమాగా బాలకృష్ణ సినీ కెరీర్‌లోనే కాదు, తెలుగు సినీ చరిత్రలోనూ మైలు రాయిగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.టైమ్ మిషన్, శ్రీ కృష్ణ దేవరాయలు కాలం సెట్టింగ్స్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచింది. కృష్ణకుమార్‌గా, శ్రీ కృష్ణ దేవరాయలుగా ద్విపాత్రాభినయం చేసి తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ఈసినిమాను ఇక ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్‌ను తెరకెక్కించాలని కూడా చూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలాసార్లు ఈ సినిమాకు సీక్వెల్ ఖచ్చితంగా ఉంటుందని…

టాలీవుడ్ కు మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ
నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ కై నందమూరి అభిమానులు ఆసక్తి తో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. మోక్షజ్ఞ ఎంట్రీ గత కొన్ని సంవత్సరాలుగా ప్రేక్షక , అభిమానులకు హాట్ టాపిక్ గా ఉంది. హీరో బాలకృష్ణ తన పుట్టినరోజున ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పారు. మోక్షజ్ఞ సినీ ఎంట్రీని కన్ఫర్మ్ చేస్తూ బాలకృష్ణ అభిమానులను సర్ ప్రైజ్ చేశారు.

30 వసంతాల "ఆదిత్య 369"
శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై ప్రయోగాత్మక చిత్ర దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ , మోహిని జంటగా టైమ్ మిషన్ నేపథ్యంలో రూపొందిన సైన్స్ ఫిక్షన్ "ఆదిత్య 369 "మూవీ 1991సంవత్సరం జూలై 18 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. హీరో బాలకృష్ణ శ్రీకృష్ణ దేవరాయలు గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. దర్శకుడు సింగీతం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా "ఆదిత్య 369" మూవీ ని తెరకెక్కించారు.

"ఆదిత్య 369 "సీక్వెల్ తో మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ
నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ అనేది గత కొన్ని సంవత్సరాలుగా హాట్ టాపిక్ గా ఉన్న విషయం తెలిసిందే.ఇక మోక్షజ్ఞ సినిమాలు చేయడేమో అని ఆందోళనలో ఉన్న ఫ్యాన్స్‌కి బాలకృష్ణ తన పుట్టినరోజున గుడ్ న్యూస్ చెప్పారు. మోక్షజ్ఞ సినీ ఎంట్రీని కన్ఫర్మ్ చేస్తూ అందుకు సంబంధించిన వివరాలు కూడా వెల్లడించి బాలకృష్ణ అభిమానులను సర్ ప్రైజ్ చేశారు.

29 వసంతాల "ఆదిత్య 369 "
శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ , మోహిని జంటగా టైమ్ మెషీన్ నేపథ్యంలో రూపొందిన సైన్స్ ఫిక్షన్ "ఆదిత్య 369 " మూవీ 1991 సంవత్సరం జులై 18 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఇళయరాజా సంగీతం అందించిన ఈ మూవీ నేటితో 29 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. ఇళయరాజా స్వరకల్పనలో రూపొందిన "జాణవులే " సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. హీరో బాలకృష్ణ కృష్ణ కుమార్, కృష్ణ దేవరాయలుగా ద్విపాత్రాభినయం చేశారు. ఆరెండుపాత్రలలోనూ బాలకృష్ణ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
'ఆదిత్య 369' సెట్స్ నుండి .. ఆనాటి జ్ఞాపకాలు.. !
ఒకప్పుడు ఉన్న టెక్నాలజీ కి ఇప్పుడున్న టెక్నాలిజీకి ఎన్నో మార్పులు. అప్పట్లో సినిమా మొదలైన విషయం ఎవరికీ తెలిసేది కాదు.. ముగిసిన విషయం కూడా ఎవరికీ తెలిసేది కాదు. ఎప్పుడో సినిమా రిలీజ్ కి ముందు చిన్న ఫంక్షన్ లాంటిది ఏదైనా జరిగితే అప్పుడు తెలిసేది. ఇప్పుడు అలా కాదు. సినిమా లాంచ్ అయిన దగ్గర నుండి... సినిమా రిలీజ్ అయ్యేవరకూ అప్ డేట్స్ ఇస్తూనే వుంటారు. సినిమా పోస్టర్లు, పాటలు, ఇంటర్వ్యూ లు ఇలా ఎన్నో రకాలుగా ప్రచారం చేస్తారు. అందుకే అప్పటి సినిమా విశేషాలు కానీ.. అప్పటి ఫొటోలు కానీ ఇప్పుడు చూస్తుంటే మనకు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అవి కూడా అప్పట్లో ఉన్న కెమరామెన్ లు సెట్స్ లో అప్పుడప్పుడు కొన్ని ఫొటోస్…
ఆ సినిమా తర్వాతే 'ఆదిత్య 369' సీక్వెల్..!
ఆదిత్య 369 సీక్వెల్.. ఇప్పుడు కాదు గత కొన్నేళ్లుగా ఈ సీక్వెల్ గురించి వింటూనే ఉన్నాం. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన సోషియో ఫాంటసీ మూవీ 'ఆదిత్య 369' అప్పట్లో ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్లాన్ చేశారు అప్పట్లో. నిజానికి బాలయ్య 100వ చిత్రంగా 'ఆదిత్య 369' సీక్వెల్స్ రావాల్సింది. అయితే అనుకోని కారణాల వల్ల 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఆ తరువాత బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ తో బిజీ అవ్వడం ఆ తర్వాత వరుస సినిమాలు చేయడంతో బిజీ అయిపోయారు.