ట్యాగ్ · 52 కథనాలు · పేజీ 3
నితిన్ 'చెక్' మొదలైంది

నితిన్ యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ "దిల్ "
నితిన్ 'రంగ్ దే' షూటింగ్ కూడా షురూ

షూటింగ్ కు సిద్ధం - నితిన్
హిట్ ఇచ్చిన డైరెక్టర్ కు నితిన్ గిఫ్ట్

హీరో నితిన్ "దిల్ ఖుషి "
'భీష్మ' మేకింగ్ వీడియో
పెళ్లి పనులు స్టార్ట్
స్వీటెస్ట్ కో స్టార్ కి హ్యాపీ బర్త్ డే
వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ హీరోగా 'రంగ్ దే' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వగా.. కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. మళ్లీ ఇప్పుడు షూట్ ను మొదలుపెట్టారు. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ రోజు కీర్తి సురేష్ పుట్టినరోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా టాలీవుడ్ ప్రముఖులు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
నితిన్ 'చెక్' మొదలైంది
సినిమా రిలీజ్ లు విషయం పక్కనపెట్టి వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు నితిన్. ప్రస్తుతం నితిన్ రంగ్ దే సినిమా షూటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ముంగింపు దశకు రాగానే మరో సినిమాను లైన్ లో పెట్టేసాడు. నితిన్-చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చెక్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌కు ముందు ఈ సినిమా షూటింగ్ మొదలైంది. అయితే కరోనా వల్ల షూట్ కు బ్రేక్ వచ్చింది. ఇక ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా... ఇటీవల హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా `చెక్` యూనిట్ ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

నితిన్ యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ "దిల్ "
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వి వి వినాయక్ దర్శకత్వంలో నితిన్ , నేహ జంటగా రూపొందిన యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ "దిల్ " మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సూపర్ హిట్ "జయం " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన నితిన్ తన రెండవ మూవీ "దిల్" లో యాక్షన్ సీన్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి హీరో గా ఎస్టాబ్లిష్ అయ్యారు. కమెడియన్ వేణు మాధవ్ తన మిమిక్రీ స్కిల్స్ తో ప్రేక్షకులను అలరించారు. ఆర్ పి పట్నాయక్ సంగీతం అందించారు.
నితిన్ కొత్తసినిమా టైటిల్, ప్రీ లుక్ రిలీజ్
నితిన్-చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకూ ఈ సినిమాపై ఎలాంటి అప్ డేట్ ఇవ్వని చిత్ర యూనిట్ ఇప్పుడు ఈ సినిమా టైటిల్ ను అలాగే ఒకే సారి ప్రీ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమా టైటిల్ ను ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాకు చెక్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ప్రీ లుక్ లో నితిన్ చేతికి సంకెళ్లతో ఉండగా..అతడి ముందు చెస్ కాయిన్స్ కనిపిస్తున్నాయి. పోస్టర్ చూస్తుంటే డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి థ్రిల్లర్ స్టోరీతో సినిమాను డిజైన్ చేసినట్టు తెలుస్తోంది.
నితిన్ కొత్త సినిమా టైటిల్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్
భీష్మ సినిమా తర్వాత వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు నితిన్. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ హీరోగా 'రంగ్ దే' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రంగ్ దే సినిమా షూటింగ్ ను కూడా మొదలు పెట్టాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వగా.. కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. మళ్లీ ఇప్పుడు షూట్ ను మొదలుపెట్టారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు పి సి శ్రీరామ్ ఛాయాగ్రహణం సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.
నితిన్ 'రంగ్ దే' షూటింగ్ కూడా షురూ
మొత్తానికి టాలీవుడ్ కు ఇప్పుడిప్పుడే పాత రోజులు వస్తున్నాయి. షూటింగ్‌లను స్టార్ట్ చేసి మళ్లీ కళకళాడుతోంది టాలీవుడ్. షూటింగ్ బ్యాలెన్స్ ఉండటంతో చకచకా వచ్చి పూర్తి చేసుకుందామనే ఆలోచనలో పడ్డాయి. దీనిలో భాగంగానే ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు షూటింగ్ ను మొదలు పెట్టారు...షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు కూడా. మరికొంతమంది ఇప్పుడిప్పుడే షూటింగ్ లను మొదలుపెడుతున్నారు.

షూటింగ్ కు సిద్ధం - నితిన్
"భీష్మ " మూవీ ఘన విజయం సాధించడంతో జోరు మీదున్న యంగ్ హీరో నితిన్ వరస మూవీస్ కు కమిట్ అయ్యారు. సితార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ "రంగ్ దే !" మూవీ లో నితిన్ హీరోగా నటిస్తున్నారు. చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో "చెక్ ", బాలీవుడ్ బ్లాక్ బస్టర్ "అంధా ధున్ " తెలుగు రీమేక్ , కృష్ణ చైతన్య దర్శకత్వంలో "పవర్ పేట " మూవీస్ లో నితిన్ నటిస్తారు.
హిట్ ఇచ్చిన డైరెక్టర్ కు నితిన్ గిఫ్ట్
వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ - రష్మిక కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా భీష్మ ఈ ఏడాది శివరాత్రి రోజున విడుదలై సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. శ్రీనివాస కళ్యాణం సినిమా పరాజయం తరువాత చాల గ్యాప్ తీసుకొని నితిన్ చేసిన సినిమా భీష్మ. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంది. అంతేకాదు ఈ సినిమాను బాలీవుడ్ లో కూడా రీమేక్ చేయనున్నట్టు తెలుస్తుంది.

హీరో నితిన్ "దిల్ ఖుషి "
యంగ్ హీరో నితిన్ ఈ సంవత్సరం "భీష్మ " మూవీ తో విజయం సాధించి ఆనందం గా ఉన్నారు. వరుస మూవీస్ తో నితిన్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. నితిన్ ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న "రంగ్ దే "మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ లో కీర్తి సురేష్ కథానాయిక. దర్శకులు చంద్ర శేఖర్ యేలేటి , మేర్లపాక గాంధీ , కృష్ణ చైతన్య మూవీస్ కు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు మరో మూవీ ని అనౌన్స్ చేయనున్నారు.
క్రిస్మస్ సీజన్ లో నితిన్ - మేర్లపాక గాంధీ చిత్రం?
హిందీలో ఘనవిజయం సాధించిన `అంధాదూన్` చిత్రం... తెలుగులో రీమేక్ కానున్న సంగతి తెలిసిందే. యువ కథానాయకుడు నితిన్ హీరోగా నటించనున్న ఈ సినిమాని `వెంకటాద్రి ఎక్స్ ప్రెస్`, `ఎక్స్ ప్రెస్ రాజా` చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించనున్నాడు. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళనుంది. అంతేకాదు... రిలీజ్ డేట్ ని కూడా లాక్ చేశారట. వినిపిస్తున్న కథనాల ప్రకారం... క్రిస్మస్ కానుకగా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోందట. త్వరలోనే ఈ రీమేక్ కి సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి.
'భీష్మ' మేకింగ్ వీడియో
ఇంకా ఒక్కరోజులో నితిన్ నటించిన భీష్మ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ బిజీ గా వున్న చిత్రయూనిట్ రోజుకో అప్ డేట్ ఇస్తూనే వుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే టీజర్, ట్రయిలర్, పాటలను రిలీజ్ చేశారు. నిన్న 'వాటే బ్యూటీ' వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు.
పెళ్లి పనులు స్టార్ట్
తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే ఆ లిస్ట్ లో రానా, ప్రభాస్ తర్వాత టక్కున గుర్తొచ్చే పేరు నితిన్. కానీ ఇప్పుడు ఆ లిస్ట్ లో నుండి బయటకు వచ్చేశాడు నితిన్. గత కొద్దిరోజులుగా నితిన్ పెళ్లి పై పలు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వార్తలకు బ్రేక్ పడింది. ఈ రోజు హైదరాబాద్‌లోని తన నివాసంలో షాలినితో కలిసి నిశ్చితార్ధ వేడుకని జరుపుకున్నాడు నితిన్. ఈ వేడుకకి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మాత్రమే హాజరైనట్టు తెలుస్తుంది. ఇక ఈ విషయాన్ని నితిన్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఏప్రిల్ 16న దుబాయ్‌లోని పలాజో వర్సాచీ హోటల్‌లో వివాహ వేడుక నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.