
ట్యాగ్ · 11 కథనాలు


ఆర్య కెప్టెన్ మూవీ ట్రైలర్ రిలీజ్

"మాచర్లనియోజకవర్గం"మూవీ ట్రైలర్ కు అద్భుత స్పందన

'మాచర్ల నియోజకవర్గం' ట్రైలర్ రిలీజ్

'లైగర్' విధ్వంసం మొదలైంది..!

"లైగర్" మూవీ ట్రైలర్ రిలీజ్

'రామారావు ఆన్ డ్యూటీ' ట్రైలర్ రిలీజ్

'రాధేశ్యామ్' సెకండ్ ట్రైలర్ రిలీజ్..!

'బంగార్రాజు' ట్రైలర్ రిలీజ్

'రౌడీ బాయ్స్' ట్రైలర్ రిలీజ్

'అతిథి దేవోభవ' ట్రైలర్ రిలీజ్

పవన్ కళ్యాణ్ ఖుషి రీ రిలీజ్ ట్రైలర్ విడుదల
శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై ఎస్.జె.సూర్య దర్శకత్వం లో పవన్ కళ్యాణ్ , భూమిక జంటగా తెరకెక్కిన ఖుషి మూవీ 2001 ఏప్రిల్ 27 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో హీరో పవన్ కళ్యాణ్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ , మేనరిజమ్స్ తో ప్రేక్షకులను అలరించారు. మణిశర్మ అందించిన సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఆర్య కెప్టెన్ మూవీ ట్రైలర్ రిలీజ్
పలు సూపర్ హిట్ మూవీస్ తో తమిళ ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ హీరో ఆర్య , ఆ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ వరుడు మూవీ తో ఆర్య టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. కన్నడ , మలయాళ భాష మూవీస్ లో కూడా ఆర్య నటించారు. హీరో ఆర్య ఇప్పుడు ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

"మాచర్లనియోజకవర్గం"మూవీ ట్రైలర్ కు అద్భుత స్పందన
రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్ , శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్స్ పై ఎడిటర్ శేఖర్ దర్శకత్వంలో నితిన్ ,బ్లాక్ బస్టర్ “ఉప్పెన”మూవీ ఫేమ్ కృతి శెట్టి జంటగా సోషల్ మెసేజ్ తో తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్ “మాచర్ల నియోజకవర్గం” మూవీ ఆగస్ట్ 12వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో క్యాథరీన్ మరో కథానాయిక. ప్రభుత్వ ఆఫీసర్ గా నితిన్ నటిస్తున్న ఈ మూవీలో విలన్ గా సముద్ర ఖని నటిస్తున్నారు. హీరోయిన్ అంజలి ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మహతి సాగర్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “మాచర్ల నియోజకవర్గం” మూవీ పోస్టర్‌లు, గ్లింప్స్, సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

'మాచర్ల నియోజకవర్గం' ట్రైలర్ రిలీజ్
నితిన్ హీరోగా ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'మాచర్ల నియోజకవర్గం'. రాజకీయాంశాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో ఇంతకుముందెన్నడూ చేయని పాత్రలో నితిన్ మొదటిసారి నటిస్తున్నాడు. ఈ మూవీలో సిద్దార్ధ రెడ్డి అనే ఐఏఎస్ అధికారిగా పాత్రలో నితిన్ కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

'లైగర్' విధ్వంసం మొదలైంది..!
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా లైగర్. ఈసినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఆ అంచనాలను తమ అప్ డేట్ లతో పెంచుకుంటూనే వస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్లు కానీ, గ్లింప్స్, టీజర్ అన్నీ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇక తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ అయితే ఈ అంచనాలను మరింత పెంచాయి. నేడు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మాస్ డైలాగ్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో ట్రైలర్ అదిరిపోయింది. పెద్దగా డైలాగ్స్ లేవు కానీ.. విజయ్ నటన, బాక్సింగ్ సన్నివేశాలు ఇంకా రమ్యకృష్ణ రోల్ ఇవన్నీ సినిమాపై ఆసక్తిని పెంచాయి. అంతేకాదు రిలీజ్…

"లైగర్" మూవీ ట్రైలర్ రిలీజ్
పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ “లైగర్” ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ , మకరంద దేశ్ పాండే , రమ్యకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. తనీష్ బాగ్చి సంగీతం అందించగా , మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ మూవీ కై విజయ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నారు.”లైగర్” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు, వీడియోలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.“లైగర్” మూవీ పాన్ ఇండియా…

'రామారావు ఆన్ డ్యూటీ' ట్రైలర్ రిలీజ్
క్రాక్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు రవితేజ. అయితే ఆ తరువాత వచ్చిన ఖిలాడి సినిమా మాత్రం మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఆశలన్నీ రామారావు ఆన్ డ్యూటీ పైనే ఉన్నాయి. శరత్ మండవ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాపై మొదటి నుండీ భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమాలో మొదటిసారి రవితేజ ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు కానీ, పాటలు, టీజర్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ట్రైలర్ ను బట్టి పిల్లలు కిడ్నాప్ అయ్యే ఇన్సిడెంట్‌తోనే సినిమా కథ ఉండబోతున్నట్టు కనిపిస్తుంది. రవితేజ మరోసారి తన ఎనర్జిటిక్…

'రాధేశ్యామ్' సెకండ్ ట్రైలర్ రిలీజ్..!
వెండి తెర పుట్టిన దగ్గర నుండి ఎన్నో ప్రేమకథలను సిల్వర్ స్క్రీన్ పై చూసుంటాం. ప్రేక్షకులు కూడా ప్రేమకథలు ఎప్పుడు వచ్చినా వాటికి కనెక్ట్ అవుతూనే ఉంటారు. రొటీన్ గా కాకుండా ఆ ప్రేమకథల్లోనే కాస్త కొత్తదనం చూపిస్తే బ్రహ్మరథం పట్టేస్తారు. ఇక ఇప్పుడు అలాంటి ప్రేమకథతోనే ప్రేక్షకులను మాయ చేయడానికి వచ్చేస్తున్నాడు ప్రభాస్. కెరీర్ స్టార్టింగ్ లో కాస్త లవ్ స్టోరీలు తీసినా ఆ తరువాత కొంతకాలం యాక్షన్ సినిమాలకే పరిమితమైన ప్రభాస్ ఇప్పుడు రాధేశ్యామ్ లాంటి వింటేజ్ ప్రేమకథతో లవర్ బాయ్ లాగ మారిపోయాడు.

'బంగార్రాజు' ట్రైలర్ రిలీజ్
నాగార్జున ప్రధాన పాత్రలో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే కదా. బంగార్రాజు పాత్రలో తన చలాకీ నటనతో ప్రేక్షకులను ఆకట్టున్నాడు నాగార్జున. అందుకే ఈ పాత్ర పేరుతోనే ఇప్పుడు సీక్వెల్ గా బంగార్రాజు సినిమాతో వచ్చేస్తున్నారు. అయితే ఈసినిమాలో నాగార్జునతో పాటు తనయుడు నాగచైతన్య కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. దీంతో ఈసినిమాపై మరింత ఇంట్రెస్ట్ పెరిగింది అందరికీ. తండ్రీకొడుకులిద్దరూ మరోసారి ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తుండటంతో అక్కినేని అభిమానులు సినిమాకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

'రౌడీ బాయ్స్' ట్రైలర్ రిలీజ్
ఈ ఏడాది సంక్రాంతికి పెద్ద సినిమాలు బరిలో లేకపోవడంతో చిన్న హీరోలు అందరూ సంక్రాంతికి పోటీకి దిగుతున్నారు. అందులో రౌడీ బాయ్స్ సినిమా కూడా ఒకటి. ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల చేస్తున్నారు. ప్రొడ్యూసర్ శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ , పాటలుప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మొదటి సినిమా అయినప్పటికీ ఫుల్ ఎనర్జీతో ఆశిష్ చేసిన డాన్సులు, ఫెర్ఫామెన్స్ తో అందరినీ ఆకట్టుకున్నాడు.

'అతిథి దేవోభవ' ట్రైలర్ రిలీజ్
పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వంలో ఆది సాయికుమార్ అతిథి దేవోభవ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకా రెండు రోజులు మాత్రమే ఉండటంతో వీలైనంత ప్రమోషన్స్ చేస్తున్నారు చిత్రబృందం. ఇప్పటికే సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్లు, వీడియోలు, పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక రీసెంట్ గానే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. దానికి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. న్యాచురల్ స్టార్ నాని చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ అన్నీ ఈ ట్రైలర్ లో కనిపిస్తున్నాయి…