పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా లైగర్. ఈసినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఆ అంచనాలను తమ అప్ డేట్ లతో పెంచుకుంటూనే వస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్లు కానీ, గ్లింప్స్, టీజర్ అన్నీ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇక తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ అయితే ఈ అంచనాలను మరింత పెంచాయి. నేడు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మాస్ డైలాగ్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో ట్రైలర్ అదిరిపోయింది. పెద్దగా డైలాగ్స్ లేవు కానీ.. విజయ్ నటన, బాక్సింగ్ సన్నివేశాలు ఇంకా రమ్యకృష్ణ రోల్ ఇవన్నీ సినిమాపై ఆసక్తిని పెంచాయి. అంతేకాదు రిలీజ్ అయిన కొద్ది సేపటికే మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతుంది. మరోవైపు పలువురు సెలబ్రిటీలు కూడా ట్రైలర్ పై స్పందిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనిలో భాగంగానే రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ ఈ ట్రైలర్ పై స్పందిస్తూ మా పూరీ గారు ఈసారి ఇండియా బాక్సాఫీస్ పై ఎటాక్ చేస్తున్నారు.. లైగర్ విధ్వంసం మొదలైంది.. విజయ్ దేవరొండ ఇంకా రమ్యకృష్ణ గారు ఫైర్ అంటూ ప్రశంసించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ATTAAACK!! 💥💥💥
Maa puri garu ee saari INDIAN box office meeda ATTACK!! 💣💥
Vijay Deverakonda, you are a STUD!! Mentalll Presence you’ve got!! @meramyakrishnan garu 🔥🔥🔥#LIGER HAVOC BEGINS!!!
Can’t wait for the 25th @karanjohar @Charmmeofficial @PuriConnects https://t.co/HWsUvhGNxY
— S S Karthikeya (@ssk1122) July 21, 2022
కాగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా అనన్య పాండే నటిస్తుండగా. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించనున్నారు. రమ్యకృష్ణ తోపాటు బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఆగష్ట్ 25న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: