రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్ , శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్స్ పై ఎడిటర్ శేఖర్ దర్శకత్వంలో నితిన్ ,బ్లాక్ బస్టర్ “ఉప్పెన”మూవీ ఫేమ్ కృతి శెట్టి జంటగా సోషల్ మెసేజ్ తో తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్ “మాచర్ల నియోజకవర్గం” మూవీ ఆగస్ట్ 12వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో క్యాథరీన్ మరో కథానాయిక. ప్రభుత్వ ఆఫీసర్ గా నితిన్ నటిస్తున్న ఈ మూవీలో విలన్ గా సముద్ర ఖని నటిస్తున్నారు. హీరోయిన్ అంజలి ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మహతి సాగర్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “మాచర్ల నియోజకవర్గం” మూవీ పోస్టర్‌లు, గ్లింప్స్, సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“మాచర్లనియోజకవర్గం”మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను జూలై 30 వ తేదీ చిత్ర యూనిట్ గుంటూరులో గ్రాండ్ గా నిర్వహించిన విషయం తెలిసిందే. సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. లవ్ .. యాక్షన్ .. కామెడీ ప్రధానమైన సన్నివేశాలతో పాటు పవర్ ఫుల్ డైలాగ్స్ తో రూపొందిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుని , 11 గంటల్లోనే 7 మిలియన్ కి పైగా వ్యూస్ ను రాబట్టి యూట్యూబ్ లో దూసుకుపోతోంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: