OG లో బాలీవుడ్ స్టార్ హీరో

bollywood actor emraan hashmi joins in OG movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు. ముందు ముందు పవన్ రాజకీయాలతో బీజీగా ఉండాల్సి వస్తుంది అందుకే ఇప్పుడే వీలైనన్ని రోజులు షూటింగ్ లకు కేటాయిస్తున్నాడు. ప్రస్తుతం పవన్ అటు హరీష్ శంకర్ సినిమాతో అలానే సుజీత్ ఓజీతో షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు. ఈసినిమా షూటింగ్ లను మాత్రం చాలా వేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు పవన్ కళ్యాణ్. వీటిలో ఓజీ సినిమా షూటింగ్ ఏప్రిల్ లో మొదలుపెట్టగా కొంతవరకూ పూర్తి చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాలో నటించే నటీనటుడు సంబంధించిన వివరాలను తెలియచేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమాలో తమిళ్ టాలెంటెడ్ నటుడు అర్జున్ దాన్ నటిస్తున్నాడు. ఇక రెండు రోజుల క్రితం ఈసినిమాలో శ్రియా రెడ్డి కూడా నటిస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఇప్పుడు మరో బాలీవుడ్ నటుడు కూడా ఈసినిమాలో భాగమయ్యాడు. ఆహీరో ఎవరో కాదు బాలీవుడ్ లో రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న ఇమ్రాన్ హష్మీ. ఈసినిమాలో ఇమ్రాన్ హష్మీ కూడా భాగమైనట్టు పోస్టర్ రిలీజ్ చేస్తూ ప్రకటించారు.

ఈసినిమాలో ప్రియాంక అరుళ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను డీవీవీ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. రవి..కె.చంద్రన్ డీవోపీ అందిస్తున్నారు. తెలుగు తోపాటు హిందీ, మలయాళం, తమిళ్ మరియు కన్నడ భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో విడుదలకి సిద్ధమవుతోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.