ఆదిపురుష్ కి సెన్సేషనల్ అడ్వాన్స్ బుకింగ్స్ 

Adipurush Telugu Movie Bookings Create History

ఇప్పుడు ఎక్కడ చూసిన ఆదిపురుష్ మానియానే కనిపిస్తుంది.మరో కొన్ని గంటల్లో ఆదిపురుష్ థియేటర్లలోకి రానుంది.బుక్ మైషో లో 1మిలియన్ ఇంట్రెస్ట్స్ ను క్రాస్ చేసింది.అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో సెన్సేషన్ సృష్టిస్తుంది.తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు అన్ని థియేటర్లలో దాదాపు టికెట్స్ అన్ని సోల్డ్ అయ్యాయి.రెండో రోజుకూడా బుకింగ్స్ సూపర్ గా వున్నాయి.పాజిటివ్ టాక్ వస్తే మాత్రం సినిమాకు తిరుగుండదు.ఇప్పట్లో పెద్ద సినిమాల విడుదలకూడా లేదు.సో ఈజీగా బ్రేక్ ఈవెన్ ను చేరుకుంటుంది.ఇక మొదటి  రోజు 100కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టడం ఖాయంగా కనిపిస్తుంది.అదే గాని జరిగితే ఓపెనింగ్ విషయంలో ఆదిపురుష్ సరికొత్త రికార్డు ను సృష్టించనుంది.మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో  టికెట్స్ రేట్ పెంచడం కూడా సినిమాకు కలిసి రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఓవరాల్ గా సినిమాఫై అంచనాలు భారీగా వుండడంతో ఊహించని రెస్పాన్స్ వస్తుంది.ఈ అంచనాలను గనుక అందుకుంటే ఆదిపురుష్ రికార్డులు తిరగరాయడం ఖాయం.మరికొన్ని గంటల్లో సినిమా భవితవ్యం ఏంటో తేలిపోనుంది.

రామాయణం ఆధారంగా ఓం రౌత్ తెరకెక్కించిన ఈసినిమాలో ప్రభాస్,రాముడిగా,కృతి సనన్ సీతగా నటించింది.సుమారు 500కోట్ల బడ్జెట్ తో గుల్షన్ కుమార్,ప్రసాద్ సుతార్,రాజేష్ నాయర్,కృష్ణన్ కుమార్,వంశీ,ప్రమోద్ నిర్మించారు.అజయ్- అతుల్ సంగీతం అందించారు.తెలుగు,హిందీ తోపాటు కన్నడ,తమిళ,మలయాళ భాషల్లో కూడా విడుదలకానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.