నాంది సినిమా నుండి తన స్టోరీ సెలక్షన్ లో రూట్ మార్చాడు అల్లరి నరేష్. ప్రస్తుతం కాస్త సీరియస్, యాక్షన్ సినిమాలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా ఉగ్రం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కింది. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో నాంది రాగా ఆసినిమాకు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కడంతో మరోసారి ఉగ్రం తీశారు. ఈసినిమా కూడా రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. మొదటిసారి అల్లరి నరేష్ అంత సీరియ్ రోల్ లో ఇంకా యాక్షన్ సీక్వెన్స్ లలో నటించి మెప్పించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఓటీటీలో కి వచ్చేసిన సంగతి తెలిసిందే కదా. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ లో ఈసినిమా జూన్ 2 నుండి స్ట్రీమింగ్ లోకి వచ్చింది. అయితే ఈసినిమా ఓటీటీలో మాత్రం సూపర్ రెస్పాన్స్ ను దక్కించుకుంటుంది. థ్రిల్లర్ సినిమాలు అంటే అందరికీ ఆసక్తి ఉంటుంది కాబట్టి.. ఉగ్రం కూడా మిస్సింగ్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన సినిమా కాబట్టి ఈసినిమా ఓటీటీలో మంచి ఆదరణను సొంతం చేసుకుంటుంది. అప్పుడే ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ప్రస్తుతం అయితే ఇండియా వైడ్ రెండో స్థానంలో అయితే ట్రెండింగ్ లోకి వచ్చింది. మరి మిక్డ్స్ టాక్ తెచ్చుకున్న ఈసినిమా ఓటీటీలో ట్రెండింగ్ లోకి రావడం మాత్రం విశేషం అనే చెప్పాలి.
కాగా ఈసినిమాల మిర్నా హీరోయిన్ గా నటించింది. ఇంద్రజ, శరత్ లోహితాశ్వ, శత్రు తదితరులు కీలక పాత్రలు పోషించారు. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి,హరీష్ పెద్ది ఈసినిమాను నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈసినిమాకు సిద్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























