ఉస్తాద్ భగత్ సింగ్ లో అవే హైలెట్స్

interesting update on ustaad bhagat singh movie highlights

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఒకటి కాదు రెండు కాదు మూడు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ షూట్ లతో తీరిక లేకుండా షూట్ లు చేస్తున్నాడు. అందులో హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా ఉంది. ఈసినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గబ్బర్ సింగ్ కాంబినేషన్ కాబట్టి సినిమాను ప్రకటించినప్పటి నుండే అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం ఈసినిమా కూడా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తిచేసుకొని సెకండ్ షెడ్యూల్ ను లైన్ లో పెట్టనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమా నుండి రీసెంట్ గానే గ్లింప్స్ ను రిలీజ్ చేయగా పవర్ స్టార్ స్వాగ్, డైలాగ్, లుక్ కు ట్రెమెండెస్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈసినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్స్ హైలెట్ గా నిలుస్తాయట. ఆయన ఒరిజినల్ క్యారెక్టర్ కు డైలాగ్స్ చాలా దగ్గరగా ఉంటాయని.. హరీష్ కూడా పవన్ కోసం పవర్ ఫుల్ డైలాగ్స్, పంచ్ డైలాగ్స్ రాశాడని అంటున్నారు. అలానే యాక్షన్ సన్నివేశాలు కూడా హైలెట్ గా నిలుస్తాయట.

కాగా ఈసినిమాలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. కాగా ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. ఈసినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.