క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించి ఆ తరువాత హీరోగా ఎంట్రీ తన నటనతో తెమిళ్ లో మాత్రమే కాదు తెలుగులో కూడా ఎంతోమంది ప్రేక్షకులను సొంతం చేసుకున్నాడు శివకార్తికేయన్. ప్రస్తుతం అయితే మంచి విజయాలతోనే కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఈమధ్య కాలంలో డాక్టర్, డాన్, ప్రిన్స్ వంటి సినిమాలతో హిట్లను అందుకున్నాడు. ప్రస్తుతం శివకార్తికేయన్ నుండి వస్తున్న సినిమా మహావీరుడు. మడోన్ అశ్విన్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రూపొందుతుంది. తమిళ్ లో మావిరన్ అనే టైటిల్ తో వస్తుండగా.. తెలుగులో మహావీరుడు అనే టైటిల్ తో వస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసే పనిలో ఉంది. దీనిలో భాగంగానే శివకార్తికేయన్ తన డబ్బింగ్ పనులు కూడా మొదలుపెట్టాడు. ఈ మేరకు శివకార్తికేయన్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం ప్రారంభించినట్లు మేకర్స్ అధికారికంగా ఒక చిన్న వీడియో విడుదల చేస్తూ తెలిపారు.
Marching ahead💪 @Siva_Kartikeyan #MaaveeranFromJuly14th #Maaveeran #Mahaveerudu#VeerameJeyam 💪🏼@madonneashwin @AditiShankarofl @DirectorMysskin #Saritha @suneeltollywood @iYogiBabu @iamarunviswa @vidhu_ayyanna @philoedit @bharathsankar12 @dineshmoffl @SunTV… pic.twitter.com/B58a26D7NC
— Shanthi Talkies (@ShanthiTalkies) May 29, 2023
కాగా ఈ సినిమాలో శివ కార్తికేయన్ కు జోడిగా అదితి శంకర్ నటిస్తోంది. ఈసినిమాను శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి విధు అయ్యన్న సినిమాటోగ్రఫీ అందిస్తుండగా భరత్ శంకర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఫిలోమిన్ రాజ్ ఎడిటర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి కుమార్ గంగప్పన్ ఆర్ట్ డైరెక్టర్. ఈ సినిమా జూలై 14, 2023న థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: