సముద్రఖని దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరోో సాయి థరమ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా బ్రో. ఈసినిమా తమిళ్ లో హిట్ అయిన వినోదయసితం అనే సినిమాకు రీమేక్ గా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
ఇప్పటికే పవన్ తన టాకీ పార్ట్ ను పూర్తిచేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి పవన్ కళ్యాణ్ అఖిమానులు ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్కే సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. సినిమాపై ఒక్కసారిగా ఓ రేంజ్ బజ్ క్రియేట్ చేసింది. ఫస్ట్ లుక్కే ఇలా ఉంటే సినిమా ఎలా ఏ రేంజ్ లో ఉంటుందో అని ఇప్పటినుండే అటు పవన్ అభిమానులు ఇటు సాయి ధరమ్ తేజ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈసినిమా నుండి షూటింగ్ కు సంబంధించి అప్ డేట్ ఇచ్చాడు సముద్రఖని.. సాయి థరమ్ తేజ్ తో షూటింగ్ ను మొదలుపెట్టినట్టు తన ట్విట్టర్ ద్వారా ఫొటో షేర్ చేస్తూ తెలిపారు.
Kick-starting with my #BRO 💪💪💪💪💪❤️❤️❤️❤️❤️ pic.twitter.com/M4sNky1obK
— P.samuthirakani (@thondankani) May 22, 2023
ఈసినిమాలో హీరోయిన్ గా కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, ప్రియా ప్రకాష్ వారియర్, రాజా చెంబోలు పలు కీలకపాత్రల్లో నటించనున్నారు. కాగా కాగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈసినిమాకు టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. త్రివిక్రమ్ ఈ సినిమాకు డైలాగులు స్క్రీన్ ప్లే.. థమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































