సమంత హార్డ్ వర్క్, పూజా స్టయిల్ ఇష్టం-నాగచైతన్య

Naga Chaitanya comments on Pooja Hegde and Samantha

అప్పట్లో టాలీవుడ్ లో ఉన్న క్యూట్ కపుల్స్ లిస్ట్ లో నాగ చైతన్య-సమంత జోడీ కూడా ఉండేది. కానీ ఆతరువాత వీరిద్దరూ విడిపోవడం.. డివోర్స్ తీసుకోవడం.. వారి కెరీర్ లో బిజీ అయిపోవడం జరిగిపోయింది. అయితే ఎందుకు విడిపోయారన్న విషయంపై ఇప్పటికీ పూర్తిగా క్లారిటీ ఇవ్వలేదు కానీ.. సమయం వచ్చినప్పుడల్లా ఒకరి గురించి ఒకరు మాట్లాడుతూనే ఉన్నారు. ఇక తాజాగా కస్టడీ ప్రమోషన్స్ లో భాగంగా సమంత గురంచి మాట్లాడుతూ చై పలు ఆసక్తికర వ్యాఖ్యాలు చేశాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా వస్తున్న సినిమా కస్టడీ. ఈసినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చై ను హీరోయిన్సో లో ఏం నచ్చుతుందని అడుగగా.. దానికి సమంత చాలా డేరింగ్ అని.. తను చాలా హార్ట్ వర్కర్.. తన హార్డ్ వర్కింగ్ స్టైయిల్ నాకు నచ్చుతుంది అని తెలిపాడు. ఇంకా పలు హీరోయిన్స్ గురించి చెబుతూ.. పూజా హెగ్డే స్టయిల్ ఇష్టమని.. కృతిశెట్టి ఇన్నోసెన్స్ నచ్చుతుందని తెలిపాడు.

కాగా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. సంపత్ రాజ్, శరత్ కుమార్, ప్రేమ్ జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.