చాలా గ్యాప్ తరువాత టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క నుండి వస్తున్న సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఈసినిమాలో నవీన్ పోలిశెట్టి కూడా నటిస్తున్నాడు. ఈసినిమాలో నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్ గా నటిస్తుండగా అనుష్క చెఫ్ పాత్రలో కనిపించనుంది. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై ఈసినిమా మంచి ఎక్సెపెక్టేషన్స్ ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరోవైపు చిత్రయూనిట్ కూడా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా టీజర్ ను రీసెంట్ గానే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ఈసినిమా టీజర్ పై ప్రభాస్ కూడా స్పందించి ప్రశంసించాడు. ఇప్పుడు తాజాగా రామ్ చరణ్ కూడా ఈసినిమా టీజర్ పై స్పందించాడు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి టీజర్ బాగుంది.. చూడటానికి చాలా రీఫ్రెషింగ్ ఉంది.. చిత్రయూనిట్ అందరికీ ఆల్ ద బెస్ట్ అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు.
Loved the #MissShettyMrPolishetty teaser, looks refreshing 😃 Good luck to the entire team. https://t.co/3MGYB8920T@MsAnushkaShetty @NaveenPolishety @filmymahesh @UV_Creations
— Ram Charan (@AlwaysRamCharan) May 4, 2023
కాగా మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కి నిరవ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తుండగా రధన్ మ్యూజిక్ ఇస్తున్నారు. ఈసినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. మరి ఈసినిమా అనుష్క కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























