ఈశుక్రవారం బాక్సాఫీస్ వద్ద రెండు సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.అందులో ఒకటి స్ట్రెయిట్ తెలుగు సినిమా ఏజెంట్ కాగా మరొకటి తమిళ్ డబ్బింగ్ మూవీ పొన్నియిన్ సెల్వన్ 2.ప్రస్తుతం రెండు సినిమాలను పోటాపోటీగా ప్రమోట్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఏజెంట్ విషయానికి వస్తే పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయాలనుకున్నప్పటికీ ప్రస్తుతానికి అయితే తెలుగు,మలయాళంలోనే రిలీజ్ చేస్తున్నారు.ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ముఖ్యంగా యాక్షన్స్ సీన్స్ హైలైట్ అయ్యాయి.ఈసినిమా విజయం అఖిల్ కెరీర్ కు కీలకం కానుంది.ఇది భారీ బడ్జెట్ సినిమా కూడా.
ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించిన ఈచిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించగా మలయాళ స్టార్ మమ్మూట్టి కీలకపాత్రలో కనిపించనున్నారు.స్టైలిష్ మూవీ మేకర్ సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి హిప్ హాప్ తమిళ సంగీతం అందించాడు.
ఇక పొన్నియిన్ సెల్వన్ 2కి కూడా మంచి హైప్ వుంది.ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ కావడంతో సెకండ్ పార్ట్ కు క్రేజ్ వచ్చింది.పాన్ ఇండియా మూవీ అవ్వడంవల్ల టీం అంతా కలిసి అన్ని భాషల్లో సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.విక్రమ్,కార్తీ,జయం రవి,త్రిష,ఐశ్వర్యా రాయ్,శోభిత దూళిపాళ్ల,ఐశ్వర్య లక్ష్మి తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈచిత్రాన్ని మద్రాస్ టాకీస్,లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి.లెజండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ఈసినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.
మరి ఈ రెండు సినిమాల్లో మీరు మొదట ఏ సినిమాను చూడాలనుకుంటున్నారో వోట్ ద్వారా తెలియజేయండి👇
[totalpoll id=”98465″]
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























