యాక్షన్ హీరో గోపీచంద్ మాత్రం సరైన హిట్ కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. తను సాలిడ్ హిట్ కొట్టి చాలాకాలమే అయిపోయింది. మధ్యలో కొన్ని సినిమాలు పర్వాలేదు అనిపించాయి కానీ కమర్షియల్ గా మాత్రం సక్సెస్ కాలేదు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా రామబాణం. శ్రీవాస్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా మే 5 వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచింది. ఈనేపథ్యంలోనే ఈసినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, పాటలు అన్నీ ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది. ఆర్గానిక్ ఫుడ్ బిజినెస్ చేసే జగపతిబాబు .. ఆయనను దెబ్బతీయడానికి విలన్ చేసే ప్రయత్నంగా ఈ కథ నడుస్తుందని అనిపిస్తోంది. జగపతిబాబును సపోర్టు చేసే తమ్ముడిగా గోపీచంద్ కనిపిస్తున్నాడు. అటు మాస్ తో పాటు ఎమోషనల్ కంటెంట్ కూడా పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తుంది. గోపీచంద్‌లోని మాస్, యాక్షన్‌ను మరోసారి ఈ సినిమాలో మనకు పూర్తిగా చూపించబోతున్నట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. అలానే జగపతి బాబు, ఖుష్బూ గోపీచంద్ అన్నావదినల పాత్రల్లో నటిస్తుండటంతో ఎమోషనల్ కంటెంట్ గా కనిపిస్తుంది. నేను హైవేలో డేంజర్ బోర్డులాంటివాడిని .. వార్నింగ్ ఇచ్చిన తరువాత కూడా స్పీడ్ తగ్గించకపోతే .. చావు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అని గోపీచంద్ చెప్పే డైలాగ్ హైలెట్ గా నిలుస్తుంది.
Good Relations + Healthy Food = HAPPY LIFE ❤️✨#RamabanamTrailer is out now 🔥
– https://t.co/DZt7pzdq1h#RamaBanam in Theatres from MAY 5th💥#RamabanamOnMay5
Macho Starr @YoursGopichand @DirectorSriwass @IamJagguBhai @khushsundar @DimpleHayathi @MickeyJMeyer pic.twitter.com/RJv7Z93gsl— People Media Factory (@peoplemediafcy) April 20, 2023
కాగా ఈసినిమాలో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాలో ఇంకా జగపతిబాబు, ఖుష్బూ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాలో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటిస్తుంది.పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈసినిమా మే 5వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు రీసెంట్ గానే అధికారికంగా ప్రకటించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































