పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం గ్యాప్ లేకుండా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. పలు సినిమాలు పవన్ లిస్ట్ లో ఉండగా..ఇప్పటికే సముద్రఖని సినిమాలో తన షూటింగ్ పార్ట్ ను పూర్తి చేశాడు. ఇక ఈనెలలో పవన్ ఫుల్ బిజీ ఉంటాడని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టే పవన్ షెడ్యూల్స్ చూస్తే అదే అనిపిస్తుంది. ఈ నెల ఫస్ట్ వీక్ లోనే హరీష్ శంకర్ షూటింగ్ మొదలైంది. అలా మొదలైందో లేదో అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ అలా కంప్లీట్ అయిన వెంటనే పవన్ ఓజీ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సుజీత్ దర్శకత్వలో పవన్ హీరోగా వస్తున్న సినిమా ఓజీ. ఈసినిమా పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక తాజాగా ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించారు చిత్రయూనిట్. ముంబైలో ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించినట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. పవన్ వచ్చే వారం షూటింగ్ లో పాల్గొంటారని తెలిపారు.ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ కీలక తారాగణం పాల్గొంటారని తెలుస్తుంది.
We are beginning the shoot of our film #OG today in Bombay… https://t.co/GHxG8txrsn
The #OG @PawanKalyan garu will be joining us next week🔥🔥 @sujeethsign @dop007 @MusicThaman #ASPrakash @DVVMovies #FireStormIsComing 🔥#TheyCallHimOG 💥
— DVV Entertainment (@DVVMovies) April 15, 2023
కాగా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాలో గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఈసినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. రవి..కె.చంద్రన్ డీవోపీ అందిస్తున్నారు. ఈసినిమాలో నటించే నటీనటులు, ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























