ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్

ustad bhagat singh movie first schedule completed

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఒకటి. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమాకావడంతో మరోసారి వీరిద్దరి కాంబినేషన్ సినిమా కోసం చూస్తున్నారు. ఎంతో కాలం నిరీక్షణ తరువాత ఇటీవలే ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లారు. ఈసినిమా తేరీ సినిమా రీమేక్ అంటున్నా హరీష్ మాత్రం పవన్ మ్యానరిజమ్స్ కు తగ్గట్టుగా డైలాగ్స్ తో ఫ్యాన్స్ కు ఎలాంటి ఎలిమెంట్స్ కావాలో అవన్నీ చూసుకుంటూ కథను సిద్దం చేశాడట. ఉస్తాద్ భగత్ సింగ్ నుండి ఇప్పటికే విడుదలైన పవన్ కళ్యాణ్ స్టైలిష్ పోస్టర్లు అభిమానులను అమితంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఎనిమిది రోజుల పాటు జరిగిన మొదటి షెడ్యూల్‌లో మేకర్స్ పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్టు సమాచారం. స్టంట్ డైరెక్టర్ ద్వయం రామ్-లక్ష్మణ్ పర్యవేక్షణలో పవన్ కళ్యాణ్ వెయ్యి మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించారట. ఇంకా భారీగా రూపొందించిన పోలీస్ స్టేషన్ సెట్‌లో మరికొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారట. ఈ షెడ్యూల్ లో శ్రీలీల తో పాటు నర్రా శ్రీను, చమ్మక్ చంద్ర, గిరి, టెంపర్ వంశీ, నవాబ్ షా, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్ వంటి పలువురు నటీనటులు పాల్గొనగా..మొదటి షెడ్యూల్‌లో చిత్రీకరించిన సన్నివేశాల పట్ల చిత్ర బృందం ఎంతో సంతృప్తిగా ఉందట.

కాగాకాగా ఈసినిమాలో శ్రీలీల, అశుతోష్ రాణా, నవాబ్ షా, కేజీఎఫ్ అవినాష్, గౌతమి, నర్రా శ్రీను, నాగ మహేష్, టెంపర్ వంశీ తదితరులు నటిస్తున్నారు. ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. ఈసినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు మరియు తదుపరి షెడ్యూల్ వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.