ప్రామిసింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా ఆఫీషియల్ గా లాంచ్ కూడా అయ్యింది. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కు డేట్ ఫిక్స్ చేశారని సమాచారం. ఏప్రిల్ 5నుంచి షూటింగ్ జరుగనుందట. ఇప్పటికే ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి సెట్ వర్క్ కూడా పూర్తి చేశారు. బ్లాక్ బాస్టర్ కోలీవుడ్ మూవీ తెరి కి రీమేక్ గా తెరకెక్కనుంది ఈ చిత్రం. అయితే పేరుకే ఇది రిమేక్ కానీ స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేసి హరీష్ తనదైన స్టైల్లో తెర మీదకు తీసుకురానున్నాడట. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండనున్నారు. త్వరలోనే ఇందులో నటించనున్న హీరోయిన్లను అధికారికంగా ప్రకటించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలుపాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇక ఇంతకుముందు హరీష్ శంకర్ ,పవన్ కళ్యాణ్ , దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. మరి ఇదే కాంబినేషన్ లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కూడా అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందో లేదో చూడాలి.
ఇక పవన్ ఇటీవలే వినోదయ సీతం అనే రీమేక్ మూవీ షూటింగ్ ను పూర్తి చేశాడు. సముద్రఖని తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ మరో హీరోగా నటిస్తున్నాడు. జూలై 28న ఈ సినిమా విడుదలకానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ,జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























