ఈమధ్య యంగ్ హీరోలు హీరోలుగా మాత్రమే కాదు డైరెక్టర్లుగా, రచయితలుగా కూడా తమ టాలెంట్ ను చూపిస్తున్నారు. అలాంటి వారిలో ముందుంటాడు విశ్వక్ సేన్. మొదటి సినిమాతోనే డైరెక్టర్ గా తన సత్తా చూపిన విశ్వక్ సేన్ ఇప్పుడు మరోసారి ధమ్కీ తో డైరెక్టర్ గా సక్సెస్ అయ్యాడు. విశ్వక్ సేన్ హీరోగా స్వీయ దర్శకత్వంలో వచ్చిన సినిమా ధమ్కీ. ఈసినిమా ఉగాది పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. డ్యూయల్ రోల్ లో విశ్వక్ సేన్ చూపించిన వేరియన్స్ అలానే కామెడీ తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉండటంతో సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా మంచి కలెక్షన్స్ ను అందిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా 8.88కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకొని 4కోట్లకు పైగా షేర్ ను సొంతం చేసుకుంది. దీంతో ఈసినిమా బ్రేక్ ఈవెను రాబట్టుకోవడం పెద్ద కష్టం ఏం కాదని అర్థమవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక్కడ మాత్రమే కాదు యూఎస్ లో కూడా ఈసినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. యూఎస్ బాక్సాఫీస్ కు బాగానే ధమ్కీ ఇస్తున్నాడు. రెండు రోజుల్లో ఈసినిమా 200కే డాలర్ల కలెక్షన్స్ ను రాబట్టుకుంది. మరి రెండు రోజుల్లో ఈ రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టుకుందంటే మాములు విషయం కాదు. అంతేకాదు ఈ చిత్రం లాంగ్ రన్ లో అక్కడ మంచి వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.

కాగా ఈసినిమాలో నివేదా పేతురాజు హీరోయిన్ గా నటించగా ఇంకా ఈ సినిమాలో రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ ఇతర పాత్రల్లో నటించారు. వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మించిన ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ డైలాగ్స్ అందించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























