అఖండ, వీర సింహారెడ్డి వంటి వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో దూసుకుపోతోన్న నందమూరి బాలకృష్ణ #NBK 108 మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా #NBK108 మూవీ తెరకెక్కుతుంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ కాజల్ అగర్వాల్ కథానాయిక కాగా , శ్రీలీల ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ లో శరత్ కుమార్, బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ రాంపాల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. #NBK108 మూవీ లో బాలయ్య మూడు వైవిధ్యమైన షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం .
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బ్లాక్ బస్టర్ ధమాకా మూవీ సక్సెస్ తో పలు మూవీ అవకాశాలు అందుకుని శ్రీ లీల టాలీవుడ్ లో బిజీగా మారారు. ఉగాది పండగ సందర్భంగా శ్రీలీల అభిమానులతో స్పెషల్ చిట్ చాట్ లో పాల్గొన్నారు. శ్రీ లీల మాట్లాడుతూ .. ఉగాది ప్రతి సంవత్సరం ఒక పెద్ద వేడుక అనీ , ఇది నూతన సంవత్సరం మొదటి రోజనీ , ఇంటిల్లిపాదీ ఆనందంగా జరుపుకునే పండగ.అనీ , చిన్నప్పటి నుంచి ఉగాది పచ్చడి అంటే తనకు చాలా ఇష్టం.అనీ , బెల్లం- మావిడి – తీపి- పులుపు- కారం అన్ని రుచుల మంచి మిశ్రమం.అనీ , ఇది మంచి చిత్రంలా అన్ని భావోద్వేగాలను సూచిస్తుందనీ , అనిల్ రావిపూడి- బాలకృష్ణ సినిమా సెట్స్ లో ఎంతో ఎనర్జీ కనిపిస్తోందనీ , తాను వారితో కలిసి పని చేయడాన్ని ఆస్వాధిస్తున్నాననీ , రిలాక్స్ డ్ గా ఉంటూ సెట్లో సానుకూల వైబ్ ని ఆస్వాధిస్తున్నాననీ , తాను బాలకృష్ణ గారికి వీరాభిమానినిఅనీ , ఆయనను కలిసిన తర్వాత ఇంకా పెద్ద అభిమానిగా మారాననీ , .అంత గొప్ప వ్యక్తిత్వం ఆయనదనీ , తాను బాలకృష్ణ గారితో కలిసి నటించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాననీ ,ఎగ్జయిటింగ్ గా పని చేస్తాననీ , ఎందుకంటే తాను కెరీర్ బెస్ట్ ని అందించాలనుకుంటున్నాననీ చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























