NBK 108- ఇది శాంపిల్ మాత్రమే

director anil ravipudi about nbk108 first look response

నందమూరి బాలకృష్ణ ఒక సినిమా తరువాత మరో సినిమా చేసుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే వరుసగా అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్లాక్ బస్టర్ కొట్టి ఫామ్ లో ఉన్నాడు బాలయ్య. ఇక ఇప్పుడు అదే జోష్ తో అనిల్ రావిపూడి సినిమా చేస్తున్నాడు. ఈసినిమా కోసం అనిల్ కూడా బాలయ్య ఇమేజ్ కు తగ్గట్టు ఒక సాలిడ్ కథతోనే వస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా ముగించుకుంటుంది. ఇప్పటికే ఈసినిమాలో నటిస్తున్న కాజల్, ఇంకా శ్రీలలకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేశారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా నుండి నిన్న ఉగాది పండుగ సందర్భంగా బాలకృష్ణ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక ఫస్ట్ లుక్ మాత్రం మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది. ఈనేపథ్యంలో ఫస్ట్ లుక్ కు వచ్చిన రెస్పాన్స్ పై అనిల్ రావిపూడి కూడా స్పందిస్తూ.. ఆ లుక్కే అన్నీ చెబుతుంది.. గిది శాంపిల్ మాత్రమే అంటూ మరొక ఫోటో ను రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ కి ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ అనిల్ తన పోస్ట్ లో తెలిపారు.

కాగా ఈసినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీలీల ఒక కీలక పాత్రలో నటిస్తుంది. ప్రియాంక జవాల్కర్ కూడా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈసినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఇక ఈసినిమాలో బాలకృష్ణ కుమార్తెగా శ్రీలీల అలరించనుందంట. ఈ చిత్రానికి కూడా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.