అల్లు అర్జున్ సినిమాలు, షూటింగ్ లు పక్కన పెడితే మంచి ఫ్యామిలీ మ్యాన్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఖాళీ సమయాల్లో పిల్లలు అర్హ, అయాన్ లతో టైమ్ స్పెండ్ చేస్తుంటాడు. వారిలో అర్హ చేసే అల్లరి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే అర్హకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. తన వీడియోలతో ఎప్పుడూ అలరిస్తూనే ఉంటుంది అర్హ. ఇక ఇప్పుడు అటు బన్నీ తో పాటు ఇటు అందరికీ షాకిచ్చింది అర్హ. తాజాగా స్నేహారెడ్డి అల్లు అర్హకు సంబంధించి మరో ఫొటోను పోస్ట్ చేసింది. ఇక ఫొటో అల్లు అర్హ యోగా చేస్తున్న ఫొటో. తన అరికాళ్ళని తన తలకి టచ్ చేస్తున్న యోగా ముద్రను అర్హ వేస్తుండగా.. ఇక బన్నీ హ్యాపీగా చూస్తూ పక్కనే కూర్చున్నాడు. ఇప్పుడు ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక బన్నీ-సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా ఎంత బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే కదా. కేవలం తెలుగులోనే కాదు ఇతర లాంగ్వేజస్ లో కూడా ఈసినిమా మంచి టాక్ తో మంచి వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతుంది. ప్రస్తుతం అయితే తను పుష్ప2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. పుష్ప..ది రూల్ కూడా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. రెండో పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుంది. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. అయితే ఇతర నటీనటులపై క్లారిటీ రావాల్సి ఉంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



































