రీసెంట్ గానే వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకువచ్చిన విజయ్ ఆసినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు. ఆ వెంటనే మరో సినిమాను మొదలుపెట్టేశాడు. ప్రస్తుతం విజయ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. మాస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో సంజయ్ దత్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ మధ్యనే సంజయ్ దత్ కూడా ఈసినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. ఇక తాజాగా సంజయ్ దత్ కశ్మీర్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నాడు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలిపింది. థ్యాంక్యూ సంజయ్ సార్.. మీరు చాలా స్వీట్.. మీ రాకతో చిత్రయూనిట్ చాలా ఎంజాయ్ చేశాం.. మళ్లీ చెన్నై షెడ్యూల్ లో కలుసుకుందాం అంటూ తెలిపారు.

ఈసినిమాకు ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తుండగా జగదీష్ పళనిసామి సహ నిర్మాతగా వ్యవహరించనున్నట్టు తెలిపారు. కత్తి, మాస్టర్, బీస్ట్ చిత్రాలతో చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లను అందించిన రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్.. ‘దలపతి 67’ కోసం నాల్గవ సారి విజయ్ తో కలసి పని చేస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా మనోజ్ పరమహంస పనిచేస్తుండగా.. సతీశ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా.. అన్బరివ్ యాక్షన్ కొరియోగ్రఫర్‌గా పనిచేస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























