ఈమధ్య ప్రేక్షకులు సినిమాను చూసే కోణం మారిందని పలు సినిమాలకు దక్కుతున్న ఆదరణ చూస్తే తెలుస్తోంది. హీరో ఎవరు, డైరెక్టర్ ఎవరూ, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు.. అని ప్రేక్షకులు చూసే రోజులు పోయాయి. కథ ఎలా ఉంది.. కథ ప్రేక్షకులకు ఎంత కనెక్ట్ అవుతుంది అన్నది మాత్రమే చూస్తారు. అందుకే పెద్ద సినిమాలు ఎలా అయితే విజయాలు దక్కించుకుంటున్నాయో.. చిన్న సినిమాలు కూడా అలానే బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకుంటున్నాయి. ఈ విషయం బలగం సినిమాతో మరోసారి రుజువైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కమెడియన్ వేణు దర్శకుడిగా పరిచయం అవుతూ ప్రియదర్శి హీరోగా వచ్చిన సినిమా బలగం. కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈసినిమా మార్చి 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకుంది. ఇక నేడు ఈసినిమా టీమ్ ను మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. భోళా శంకర్ సెట్ లో బలగం టీం ను సన్మానించి చిత్రయూనిట్ ప్రశంసలు కురిపించారు. అంత మంచి సినిమా తీసి మాకు షాక్ ఇస్తే ఎలా అంటూ దర్శకుడు వేణుని అభినందించాడు. తెలంగాణ సంస్కృతిని బాగా చూపించావు. దిల్ రాజు వంటి కమర్షియల్ ప్రొడ్యూసర్ ని వెంట పెట్టుకున్నా, ఎక్కడ కథ గాడి తప్పనివ్వకుండా ట్రూ ఎమోషన్స్ తో సినిమాని నడిపావు అంటూ ప్రశంసించినట్టు తెలుస్తుంది.
A mega moment for team #Balagam!
Thank you megastar @KChiruTweets Garu for your kind words! This means the world to us❤❤@OfflVenu @priyadarshi_i @KavyaKalyanram @dopvenu @LyricsShyam #BheemsCeciroleo @DilRajuProdctns @HR_3555 #HanshithaReddy @adityamusic @vamsikaka pic.twitter.com/piPOsVan5K
— Dil Raju Productions (@DilRajuProdctns) March 11, 2023
కాగా ఈసినిమాలో కావ్యా కల్యాణ్‌రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, జయరాం, విజయలక్ష్మీ, స్వరూప కీలక పాత్రల్లో నటించారు. దిల్ రాజు సమర్పణలో దిల్ రాజ్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈసినిమాకు హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించారు. భీమ్స్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: