పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురుచూసే సినిమాల్లో హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాను ప్రకటించిన దగ్గరనుండే అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈసినిమాకు ముందు భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ ను అనుకున్నారు.. ఆతరువాత ఉస్తాద్ భగత్ సింగ్ గా మార్చారు. ఇక ఈసినిమా గురించి తాజాగా సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా కోసం భారీ సెట్ ను వేసినట్టు చెబుతూ ఫొటోస్ షేర్ చేశారు. అంతేకాదు షూటింగ్ కూడా త్వరలో మొదలుపెట్టనున్నట్టు కూడా చెప్పారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Grand set being erected for #UstaadBhagatSingh 💥
Director @harish2you, art director #AnandSai and cinematographer @DoP_Bose putting in their all for a feast on the Big Screens ❤🔥
Shoot begins soon!@PawanKalyan @ThisIsDSP @MythriOfficial @UBSTheFilm pic.twitter.com/kXAb0FpBo0
— Ustaad Bhagat Singh (@UBSTheFilm) March 10, 2023
కాగా ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ సరసన పూజా హెగ్డే నటించనుంది. ఈసినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన మిగతా నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు తెలియాల్సి ఉంది. మరి చూద్దాం ఈసారి పవన్ తో హరీష్ శంకర్ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడో.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























