మహేష్ సార్ థ్యాంక్స్- మరో పసిప్రాణం కాపాడారు

Producer Naga Vamsi About Mb Foundation Greatness,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Mb Foundation,Mahesh Babu,Super Star Mahesh Babu,Mahesh Babu Movies,Mahesh Babu New Movie,Mahesh Babu Latest Movie,Mahesh Babu Upcoming Movies,Mahesh Babu Latest News,Mahesh Babu Foundation,Ssmb28,Ssmb28 Movie,Ssmb28 Telugu Movie,Ssmb28 Movie Updates,Ssmb28 Movie Latest News,Naga Vamsi,Producer Naga Vamsi,Naga Vamsi Latest News,Naga Vamsi About Mahesh Babu,Naga Vamsi On Mahesh Babu,Mahesh Babu Foundation Saves Another Child,Namrata Shirodkar,Mahesh Babu And Namrata Shirodkar,Naga Vamsi Tweet,Naga Vamsi Latest Tweet,Naga Vamsi New Tweet,Mahesh Babu Saved Another Children Heart,Mb For Saving Hearts,Mb For Saving Hearts Latest,Mahesh Babu Foundation Latest,Ghattamaneni Mahesh Babu,Producer Naga Vamsi About Mb Foundation,Naga Vamsi About Mb Foundation

సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే మహేష్ పలు గ్రామాల్ని దత్తత తీసుకొని వాటిని అభివృద్ది చేయడంలో కృషిచేస్తున్నాడు. అలాగే నిరు పేద‌ల‌కి ఆయన అండ‌గా ఉంటున్నాడు . ఇక చిన్న పిల్లలకు అయితే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వేయి చిన్న గుండెలకు మహేష్ ఆయువుపోశాడు. ఇక తాజాగామరో పసిప్రాణాన్ని కాపాడారు మహేష్. అయితే ఈవిషయాన్ని ప్రొడ్యూసర్ నాగవంశీ తన ట్విట్టర్ ద్వారా తెలియచేయడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ విషయం గురించి చెబుతూ వంశీ.. ఈ ఘటన కొన్ని వారాల క్రితం జరిగింది.. నా క్లోజ్ ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేశాడు.. ఓ పూర్ ఫ్యామిలీ ఉంది.. వాళ్లు తమ పాపకు గుండె ఆపరేషన్ చేయించాలని అనుకుంటున్నారు.. ఎంత ట్రై చేసినా డబ్బులు దొరకడం లేదు.. వాటి కోసం ఎంతో కష్టపడుతున్నారు.. ఎంబీ ఫౌండేషన్‌ ఎలా రీచ్ కావాలో చెప్పు.. కాస్త సాయం చేయమని అడిగాడు. నేను వెంటనే ఆ కేస్ గురించి నమ్రత గారికి ఫోన్ చేసి చెప్పాను. ఆమె వెంటనే ఎంబీ ఫౌండేషన్‌కు సమాచారం ఇచ్చింది. ఆ పాప డీటైల్స్ తీసుకున్నారు. రెండు వారాల తరువాత నాకు వారి దగ్గరి నుంచి మెసేజ్ వచ్చింది. పాప క్షేమంగా ఉంది. ఆపరేషన్ చేశారు అని చెప్పారు. మహేష్‌ బాబు, నమ్రత గారికి మేం ఎప్పటికీ రుణ పడి ఉంటామని ఆ తల్లిదండ్రులు ఎమోషనల్ అయ్యారు. ఇలాంటి ఎన్నో కుటుంబాల దీవెనలు.. మహేష్‌తో పాటు అతని ఫ్యామిలీని చల్లగా, సంతోషంగా ఉంచుతాయని మహేష్, నమ్రత గారికి మరోసారి థాంక్స్ అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు.

ఇక ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈసినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తుంది. దీనితో పాటు మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను ముగించుకునే పనిలో ఉంది. ఇక రాజమౌళి తో కూడా మహేష్ బాబు ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.