సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ 2021 డిసెంబర్ 17న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక, అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఈ మూవీతో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. పుష్ప మూవీ సెకండ్ పార్ట్ పుష్ప :ది రూల్ మూవీ షూటింగ్ ప్రారంభం అయిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పుష్ప 2 మూవీ వైజాగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కొత్త షెడ్యూల్ కి యూనిట్ రెడీ అవుతుంది. తదుపరి షెడ్యూల్ బ్యాంకాక్ లో చిత్రీకరించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. బ్యాంకాక్ లో నెలరోజుల పాటు జరిగే షెడ్యూల్ లో అక్కడి ఫారెస్టు ఏరియాలో కొన్ని కీలకమైన యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించనున్నట్టు, తాజాగా రష్మిక…బన్నీ పై చిత్రీకరించాల్సిన సన్నివేశాలు ఉండటంతో టీమ్ తో పాటు రష్మిక కూడా బ్యాంకాక్ వెళ్లనున్నట్టు, ఇక్కడే బన్నీ సింహంతో తలపడే ఓ పొరాట సన్నివేశాన్ని చిత్రీకరించనున్నారనీ, అటవి నేపథ్యం ఉన్న సన్నివేశాల్లో జంతువులతో ఫైట్ పెడితే మరింత రక్తి కడుతుందని భావించి దర్శకుడు ఈ సీన్ డిజైన్ చేసినట్లు సమాచారం. ఆర్ఆర్ఆర్ మూవీ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో సింహంతో తలపడిన సంగతి తెలిసిందే. ఆ ఇంట్రో సీన్ సినిమాకి హైలైట్ గా నిలిచింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























