ధమ్కీ షూటింగ్ అప్ డేట్

Vishwak Sens Dhamki Movie Shooting Update,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Dhamki,Dhamki Movie,Dhamki Telugu Movie,Dhamki Movie Updates,Dhamki Telugu Movie Latest News,Dhamki Movie Shooting Updates,Dhamki Telugu Movie Shooting Latest News,Vishwak Sens Dhamki,Vishwak Sens Dhamki Movie,Vishwak Sens Dhamki Telugu Movie,Vishwak Sens Dhamki Movie Shooting Live Updates

కేవలం నటుడిగా మాత్రమే కాదు దర్శకుడిగా కూడా ఇప్పటికే తన సత్తా చాటుకున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక ఇప్పుడు మరోసారి దర్శకుడిగా తన టాలెంట్ ను చూపించడానికి వచ్చేస్తున్నాడు. విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న సినిమా ధమ్కీ. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు రెడీ అవుతుంది. దీనిలో భాగంగానే మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే ట్రైలర్ 1.0 అంటూ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం చిత్రయూనిట్ చివరి సాంగ్ షూటింగ్ ను స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. పబ్ నేపథ్యంలో సాగే ఈపాట చిత్రీకరణకు మూడు రోజులు టైమ్ పట్టనుందట. ఆతరువాత పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టనున్నారట.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమా కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో రాబోతున్నట్టు తెలుస్తుంది. ఈసినిమాలో నివేదా పేతురాజు హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో రావు రమేష్, రోహిణి, హైపర్ ఆది, పృథ్వీరాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాకు బెజవాడ ప్రసన్నకుమార్ కథని.. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను కరాటే రాజు నిర్మిస్తున్నాడు. ఇక ఈసినిమాను ఫిబ్రవరి 17వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఈసినిమాలు పనులు ఇంకా పూర్తవ్వకపోవడంతో రిలీజ్ డేట్ వాయిదా పడే అవకాశం ఉందంటున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.