శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో హీరో నాని, కీర్తి సురేష్ జంటగా సింగరేణి కోల్ మైన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ దసరా మూవీ మార్చి 30 వ తేదీ రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో సాయి కుమార్, సముద్ర ఖని, జరీనా వాహబ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న దసరా మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దసరా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. హీరో నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మాస్ సినిమాగా తెరకెక్కిన దసరా మూవీలో నాని నెవర్ బిఫోర్ రోల్‌లో కనిపించనున్నారు. దసరా మూవీ టీజర్ ఐదు భాషల్లో రిలీజ్ అయ్యింది. ఈ టీజర్ కి అన్ని భాషల ఆడియన్స్ నుండి సూపర్ గా రెస్పాన్స్ లభిస్తోంది. నాని మాస్ స్టైల్ యాక్షన్, రస్టిక్ విజువల్స్, కీర్తి సురేష్ యాక్టింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మాస్ విజువల్స్, ఫైట్స్, యాక్షన్ సన్నివేశాలతో రూపొందిన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ టీజర్‌పై స్టార్ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి సోషల్ మీడియా ద్వారా ప్రశంసలు కురిపించారు. దసరా మూవీ విజువల్స్ చాలా బాగున్నాయనీ.. నాని మాస్ లుక్ మేకోవర్ చాలా ఇంప్రెసివ్‌గా ఉందనీ.. చివరి షాట్ అయితే తోపు అనీ.. శ్రీకాంత్ ఓదెల అండ్ టీంకు ఆల్ ది బెస్ట్ అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































