నాని దసరా టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Nani Dasara Movie Teaser Release Date Fixed,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Teollywood News,Dasara,Dasara Movie,Dasara Movie Updates,Dasara Telugu Movie Latest News,Natural Star Nani,Dasara Teaser,Dasara Movie Teaser,Dasara Telugu Movie Teaser,Dasara Teaser Release Date Locked,Dasara Movie Teaser Release Date Confirmed,Dasara Telugu Movie Release Date Fixed

కెరీర్ ప్రారంభంనుండి విభిన్నమైన పాత్రలు చేసే హీరోల్లో న్యాచురల్ స్టార్ హీరో నాని కూడా ముందుంటాడు. ఇక నాని కామెడీ యాంగిల్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన కామెడీతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో దిట్ట. అయితే నాని మాస్ రోల్ లో చాలా తక్కువ పాత్రలే చేశాడు. కానీ ఫస్ట్ టైమ్ ఫుల్ మాసీ రోల్ లో వస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా వస్తున్న సినిమా దసరా. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక ఈసినిమా మార్చి 30 వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచేసింది. ఈనేపథ్యంలో ఈసినిమా నుండి టీజర్ రిలీజ్ కు రెడీ అయ్యారు. తాజాగా టీజర్ రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. ఈసినిమా టీజర్ ను జనవరి 30వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఒక వీడియో ద్వారా రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా, సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడిగా.. ఎడిటర్‌గా నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా అవినాష్‌ కొల్లా, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా విజయ్‌ చాగంటి వ్యవహరిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.