ఈ ఏడాది ప్రారంభంలోనే మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పటికే గాడ్ ఫాదర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న చిరు ఇప్పుడు ఈసినిమా హిట్ తో బ్యాక్ టు బ్యాక్ హిట్లను అందుకున్నాడు. బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో..మాస్ మహారోజా రవితేజ కీలక పాత్రలో వచ్చిన సినిమా వాల్తేరు వీరయ్య. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమాలో చిరంజీవి డ్యాన్సులు, నటన వింటేజ్ చిరంజీవిని గుర్తుచేసి ప్రేక్షకులను ఆకట్టున్నాయి. చిరు, రవితేజ మధ్య వచ్చే సన్నివేశాలు ఆడియెన్స్‌ని విపరీతంగా అలరిస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా సంక్రాంతి బరిలోకి దిగిన సంగతి తెలిసిందే కదా. జనవరి 13వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రాగా బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకుంది. ఈసినిమా రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే 100 కోట్లకు పైగా కలక్షన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఈసినిమా యూఎస్ లో కూడా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటుంది. యూఎస్ లో తన సత్తా చాటుతోంది. ఇప్పటి వరకూ అక్కడ 1.9 మిలియన్స్ డాలర్ల కి పైగా వసూళ్లను రాబట్టింది. దీంతో ఈ చిత్రం అక్కడ బ్రేక్ ఈవెన్ చేయడమే కాకుండా భారీ వసూళ్లు దిశగా దూసుకు పోతుంది.

కాగా ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటించింది. ఇంకా ఈసినిమాలో ప్రకాష్ రాజ్, బాబీ సింహా, నాజర్, సత్యరాజ్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, షకలక శంకర్ తదితరులు నటించారు. ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























