మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ వీరసింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటించారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన హీరో బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ హంట్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. బ్లాక్ బస్టర్ అఖండ మూవీ తరువాత బాలయ్య నటించిన సినిమా కావడం, బ్లాక్ బస్టర్ క్రాక్ మూవీ తరువాత గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన మూవీ కావడంతో వీరసింహారెడ్డి మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వీరసింహారెడ్డి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ఒంగోలు లో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో హీరో బాలకృష్ణ మాట్లాడుతూ.. తన అభిమాని అయిన గోపీచంద్ మలినేని ఒంగోలు నుండి చిత్ర పరిశ్రమకు వచ్చి దర్శకుడిగా నేడు ఈ స్థాయికి చేరుకోవడం ఎంతో ఆనందంగా ఉందనీ.. అలానే ప్రస్తుతం తనతో కలిసి చేసిన వీరసింహారెడ్డి మూవీ కోసం ఆయన ఎంతో కష్టపడ్డారనీ.. హీరోయిన్ గా నటించిన శృతి హాసన్, కీలక పాత్రలు చేసిన వరక్ష్మి శరత్ కుమార్, హానీ రోజ్, విలన్ గా నటించిన దునియా విజయ్ వంటి వారు సినిమాకి పిల్లర్స్ గా నిలిచారనీ.. ఇక మైత్రి మూవీస్ నిర్మాతలు, సంగీత దర్శకడు థమన్ సినిమాకి ప్రాణం పెట్టారనీ.. మొత్తంగా అందరూ కలిసి కష్టంతో చేసిన వీరసింహారెడ్డి మూవీ బాగా ఆడుతుందని చెప్పను, తప్పకుండా ఆడితీరుతుంది అంతే అంటూ చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: