మొత్తానికి నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న టైమ్ కు బ్రేక్ పడింది. మాస్ సినిమాలు తీయడంలో ఎక్పర్ట్ అయిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వస్తున్న సినిమా వీరసింహారెడ్డి. గోపీచంద్ క్రాక్ లాంటి సూపర్ హిట్ తర్వాత.. బాలకృష్ణ అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుండి ప్రతి అప్ డేట్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచాయి. బాలయ్య స్టిల్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. పాటల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. రిలీజ్ అయిన ప్రతి పాట కూడా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఒంగోలు లోని అర్జున్ ఇన్ఫ్రా గ్రౌండ్ లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసందర్భంగా అభిమానుల సమక్షంలో ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ట్రైలర్ అయితే మాస్ అండ్ యాక్షన్ కట్స్ తో అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇచ్చేలా ఉంది. ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను ఇంకా పెంచేసింది. చూద్దాం సినిమా ఇంకెంత రేంజ్ లో ఉంటుందో..
#VeeraSimhaReddy Trailer out now 😎💥🔥
– https://t.co/1uH3QxI35G#VeeraSimhaReddy #VeeraSimhaReddyOnJan12th pic.twitter.com/sdP8At3u7B
— Mythri Movie Makers (@MythriOfficial) January 6, 2023
కాగా ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో బాలయ్యకు విలన్ గా కన్నడ విలక్షణ నటుడు దునియా విజయ్ నటించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన్సర్ పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ కలిసి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు సినిమాటోగ్రఫి రిషి పంజాబీ అందిస్తున్నాడు. సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: