త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తున్న సినిమా థమాకా. కామెడీకి కామెడీ, యాక్షన్ ఎలిమెంట్స్, సంగీతం అన్నీ ఈసినిమాకు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. అందుకే ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈసినిమా సక్సెస్ ను ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్నాడు రాజమౌళి. అంతేకాదు తనకు సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్ థ్యాంక్స్ కూడా చెబుతూ ఒక పోస్ట్ చేశాడు. ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా ఎక్కడా తగ్గట్లేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా రిలీజ్ అయి 10 రోజులు పూర్తయింది. ఇక ఈ పదిరోజుల్లో ఈసినిమా ఎంత కలెక్ట్ చేసిందో ఇప్పటికే చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేసింది. 10రోజుల్లో ఈసినిమా 89కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. మరో మూడు నాలుగు రోజుల్లో 100 కోట్లు కలెక్ట్ చేస్ అవకాశం ఉంది. ఇక ఇప్పుడు ఈసినిమా మరో రికార్డ్ ను క్రియేట్ చేసింది. ఈసినిమా పదవ రోజు నాన్ ఎస్ ఎస్ రాజమౌళి రికార్డ్ ను సొంతం చేసుకుంది. అంటే..ఆర్ ఆర్ ఆర్, బాహుబలి సిరీస్ చిత్రాల తర్వాత మాస్ మహారాజా రవితేజ ధమాకా 10 వ రోజు వసూళ్లు పరంగా ఎక్కువ సాధించింది అన్నమాట. మరి నాన్ రాజమౌళి రికార్డ్ అంటే గొప్ప విషయమనే చెప్పాలి.
MassMaharaja @RaviTeja_offl ‘s
MASSive Day 1️⃣0️⃣ Rampage 💥#DhamakaBlockBuster in Cinemas Now 🥳🤩#DhamakaBook your tickets nowhttps://t.co/iZ40p9utmY@sreeleela14 @TrinadharaoNak1 @vishwaprasadtg @vivekkuchibotla @KumarBezwada pic.twitter.com/czAPi0Xk6F
— People Media Factory (@peoplemediafcy) January 2, 2023
కాగా ఈసినిమాలో సచిన్ ఖేడ్కర్, రావు రమేష్, జయరామ్, తనికెళ్ల భరణి, సీత, పవిత్ర లోకేష్, సమీర్, ప్రవీణ్, హైపర్ ఆది కీలక పాత్రల్లో నటించారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. భీమ్స్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు కార్తీక్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























