రీసెంట్ గానే అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని ప్రస్తుతం మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. దసరా అనే డిఫరెంట్ కథతో ఈసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇంతకుముందు ఎప్పుడు చేయని డీ గ్లామర్ పాత్రలో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు నాని. సింగరేణి బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ మూవీకి డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా లాస్ట్ షెడ్యూల్ ను ప్రారంభించనున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక చెప్పినట్టే ఈసినిమా లాస్ట్ షెడ్యూల్ ను ప్రారంభించారు. ఈ కొత్త షెడ్యూల్ గోదావరిఖని బొగ్గుగని సెట్లో ఈరోజు ప్రారంభమైంది. పదిహేను రోజుల షెడ్యూల్లో కీలకమైన క్లైమాక్స్ సీక్వెన్స్ చిత్రీకరించనున్నారు. ఇక ఈవిషయాన్ని చిత్రయూనిట్ తో పాటు నాని కూడా తెలియచేశారు. చివరి షెడ్యూల్లో మొదటి రోజు.. మనస్సు, శరీరం, హృదయం మరియు కోపం అన్నీ పూర్తి సామర్థ్యంతో ప్రారంభమైంది అంటూ తెలిపాడు నాని.

కాగా ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా, సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడిగా.. ఎడిటర్‌గా నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా విజయ్ చాగంటి వ్యవహరిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























