మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా2023 జనవరి 13 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీలో బిజూ మీనన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లోనటించారు. మెగా స్టార్ చిరంజీవి, శృతి హాసన్ ఫస్ట్ టైమ్ జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పన లో దేవిశ్రీ రచన, నాకాశ్ అజీజ్, హరిప్రియ, దేవిశ్రీ ప్రసాద్ గానం చేసిన, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ లో మెగా స్టార్ చిరంజీవి ,ఊర్వశి రౌటేలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన ఫస్ట్ సింగిల్ బాస్ పార్టీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని భారీ వ్యూస్ తో దూసుకుపోతోంది. చిత్ర యూనిట్ పలు పోస్టర్స్ రిలీజ్ చేస్తూ మూవీ పై ఆసక్తినికలిగిస్తుంది . తాజాగా రిలీజ్ చేసిన చిరంజీవి మాస్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సెన్సేషనల్ పోస్టర్ పై దర్శకుడు బాబీ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఈ పోస్టర్ శాంపిల్ మాత్రమేననీ , పోలీస్ స్టేషన్ ఫైట్ తో థియేటర్స్ లో పూనకాలు గ్యారంటీ అని ప్రామిస్ చేస్తున్నా అంటూ దర్శకుడు బాబీ ట్వీట్ చేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























