‘మహర్షి’ వంటి బ్లాక్బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన వంశీ పైడిపల్లితో విజయ్ ‘వారసుడు’ చిత్రాన్ని చేస్తున్నాడు. తమిళ్ స్టార్ హీరో విజయ్ కు తెలుగులో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ప్రస్తుతం మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. అంతేకాదుప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టేశారు. దీనిలోభాగంగా ఈసినిమా నుండి వరుసగా పాటలు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రంజితమే సోషల్ మీడియాలో దూసుకుపోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తాజాగా దిల్ రాజు కూడా ఓ మీడియాతో ముచ్చటించగా ఈసినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి తెలిపారు. ఈసినిమాకు ఫస్ట్ ఛాయిస్ విజయ్ కాదట.. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫస్ట్ ఛాయిస్ అని తెలిపాడు. ముందుగా ఈసినిమా కథను మహేష్ బాబుకు చెప్పగా.. మహేష్ బాబు వేరే ప్రాజెక్స్ట్ తో బిజీగా ఉండటం వల్ల కుదరలేదు. ఆ తరువాత రామ్ చరణ్ కరెక్ట్ సరిగ్గా సరిపోతాడని అనుకున్నాం. కానీ అప్పటికే చరణ్ తో ఒక సినిమా కమిట్ అయి ఉన్నాం.. దీంతో ఫైనల్ గా విజయ్ దగ్గర కు వెళ్లడం.. ఓకే అవ్వడం జరిగిపోయాయని తెలిపాడు.
ఈసినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్, శ్యామ్, ప్రకాశ్ రాజ్, సంగీత, జయసుధ, ప్రభు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈసినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























