న్యాచురల్ స్టార్ నాని ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క నిర్మాతగా మారి సినిమాలు కూడా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే కదా. రీసెంట్ గానే నాని హిట్ 2 సినిమాతో నిర్మాతగా మరో హిట్ ను సొంతం చేసుకున్నాడు. గతంలో శైలన్ కొలను దర్శకత్వంలో హిట్ సినిమా తీయగా సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఈసినిమా హిట్ అవ్వడంతో నాని తన బ్యానర్ పైనే హిట్ 2 సీక్వెల్ ను తెరకెక్కించి ఈ సీక్వెల్ తో కూడా హిట్ ను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం అయితే హిట్ 2 సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇన్ని రోజులు హిట్ 2 సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు నాని. ఫైనల్ గా సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా అయిపోయాయి. దీంతో ఇప్పుడు తన ఫోకస్ ను తన కొత్త ప్రాజెక్ట్ పై పెట్టనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇప్పటికే పలు పోస్టర్లు అలానే ఒక సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు. తాజా సమాచారం ప్రకారం ఈసినిమా నెక్ట్స్ షెడ్యూల్ ను డిసెంబర్ 16 నుండి మొదలుపెట్టనున్నట్టు సమాచారం. ఈ నెలఖారు కల్లా ఈసినిమా షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నారట.
కాగా శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా, సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడిగా.. ఎడిటర్‌గా నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా విజయ్ చాగంటి వ్యవహరిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























