ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే కదా. స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే పలు సినిమాలు రీ రిలీజ్ అయి సందడి చేశాయి. ఇక రెండు రోజుల క్రితమే.. తలైవా రజనీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా బాబా సినిమా కూడా రీరిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కూడా ఒకటి రీ రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇప్పటికే మహేష్ పుట్టినరోజు సందర్భంగా పోకిరి సినిమాను రీరిలీజ్ చేశారు. రీ రిలీజ్ లో కూడా ఈసినిమా రికార్డ్ కలెక్షన్స్ ను క్రియేట్ చేసింది. ఇప్పుడు మహేష్ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా ఒక్కడు ను కూడా రీ రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ హీరోగా వచ్చిన సినిమా ఒక్కడు. ఈసినిమా తన కెరీర్ లో ఓ క్లాసిక్ హిట్ గా నిలిచింది. ఇక ఈసినిమా రిలీజ్ అయి 20 ఏళ్లు అవుతున్న సందర్భంగా వచ్చే జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా స్పెషల్ షోస్ వేసేందుకు సిద్దమయ్యారు. మేకర్స్ కూడా ఈవిషయాన్ని కన్ఫామ్ చేశారు. మరి మహేష్ ఫ్యాన్స్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారో చూడాలి. కాగా ఈసినిమాలో భూమిక హీరోయిన్ గా నటించింది. ఎం ఎస్ రాజు నిర్మించిన ఈసినిమాకు మణిశర్మ సంగీతం అందించారు.

ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలుపెట్టారు. ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. జనవరి నుండి నాన్ స్టాప్ గా షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. కాగా ఈసినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తుంది. దీనితో పాటు మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































