ఈమధ్య కాలంలో ఎంతో మంది సెలబ్రిటీలు వివాహం చేసుకొని వివాహ బంధంలో అడుగుపెట్టారు. ఇక ఇప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ కూతురు నీలిమ గుణశేఖర్ కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టేసింది. నీలిమ గుణశేఖర్ నిశ్చితార్థం ఇటీవలే జరిగిన సంగతి తెలిసిందే కదా. ఇక నిన్న తన వివాహం ఘనంగా జరిగింది. నిన్న రాత్రి 12 గంటల 31 నిమిషాలకు ప్రముఖ విద్యావేత్త, వ్యాపారవేత్త, ఎంటర్ ప్రెన్యూరర్, శ్రీ శక్తి గ్రూప్ అధినేతలు అయిన డా.రామకృష్ణ పింజల, సత్య పింజల కుమారుడు రవి ప్రఖ్యాతో జరిగింది. హైదరాబాద్‌లోని తాజ్ ఫలక్ నామా ప్యాలెస్ వేదికగా అంగరంగవైభవంగా జరిగిన ఈ వివాహ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి, బండ్ల గణేష్, డైరెక్టర్లు మెహెర్ రమేష్, అనిల్ రావిపూడి, ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ప్రస్తుతం గుణశేఖర్ నుండి వస్తున్న సినిమా శాకుంతలం. మహాభారత ఇతిహాసంలో అద్భుతమైన ప్రేమ ఘట్టంగా చెప్పుకునే ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా చేసుకుని ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు గుణశేఖర్. స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఇక ఈసినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తిఅయిపోయింది.. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాను గుణశేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈసినిమా 3Dలో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























