టాలీవుడ్ లో ఉన్న టాలెండెట్ హీరోల్లో అడివి శేష్ పేరు ముందు వరుసలో ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే వరుస సినిమాలతో సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు. క్షణం, గూఢచారి, ఎవరు, మేజర్ ఇలా వరుస విజయాలను అందుకుంటూ వెళుతున్నాడు. ఇక ఇప్పుడు మరో థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా వస్తున్న సినిమా హిట్ 2. ఈసినిమా డిసెంబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసందర్బంగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నాడు అడివి శేష్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అడివి శేష్ మాట్లాడుతూ.. మొదటి నుంచి కూడా కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నాను. శేష్ ఒక సినిమా చేశాడంటే అందులో ఏదో కొత్త పాయింట్ ఉంటుందనే నమ్మకాన్ని జనంలో కలిగిస్తూ వెళుతున్నాను. అందుకే నా 12 ఏళ్ల ఈ ప్రయాణంలో ఈ విషయంలో కొంతవరకూ సక్సెస్ అయ్యాను. ‘క్షణం’ సినిమాకి ముందు ఎవరు ఎలాంటి కథ చెప్పినా, నాకు ఏ రకంగానైనా ఉపయోగపడుతుందేమో అనే ఒక ఆలోచనతో ఒప్పుకునేవాడిని.. కానీ ‘క్షణం’ కథ నా మనసుకు నచ్చడం వలన చేశాను .. అది వర్కౌట్ కావడంతో, ఇకపై నా మనసుకు నచ్చని కథలు చేయకూడదని నిర్ణయించుకున్నాను. ఒక్కోసారి కథ నచ్చినప్పటికీ, అందులో నేను సెట్ కానని అనిపిస్తే కూడా వదులుకున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.
కాగా ఈసినిమాలో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి నటించనుంది. నాని స్వంత ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని ఈసినిమాను నిర్మిస్తున్నారు. మణికందన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జాన్ స్టీవర్ట్ ఎడురి సంగీతాన్ని అందించనున్నారు. ఈసినిమా డిసెంబర్ 2, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























