రచయిత, దర్శకుడు మదన్ ఇక లేరు

Tollywood Director Madan Passed Away,Telugu Filmnagar,Tollywood Latest,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Tollywood Movies in 2022,Madan,Director Madan,Tollywood Director Madan,Tollywood Director Madan Passes Away,Director Madan Movies,Tollywood Director Madan Last Movie,Tollywood Director Madan Super Hit Movies,Tollywood Director Madan Upcoming Movies,Tollywood Director Madan New Movies

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన మదన్‌ ఉన్నత విద్యను అభ్యసించిన తర్వాత సినీ రంగం మీద ఆసక్తితో టాలీవుడ్‌కు వచ్చి, ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ ఎస్‌. గోపాల్‌రెడ్డి దగ్గర సహాయకుడిగా సంతోషం, మనసంతా నువ్వే వంటి చిత్రాలకు పనిచేశారు.చంద్రసిద్ధార్థ్‌ దర్శకత్వం వహించిన ఆ నలుగురు సినిమాకి కథ , స్క్రీన్ ప్లే అందించి మదన్ రచయితగా మంచి పేరు తెచ్చుకున్నారు ఈ చిత్ర విజయంతో వచ్చిన గుర్తింపుతో మదన్ దర్శకుడిగా మారి జగపతిబాబు హీరోగా పెళ్లయిన కొత్తలో, ప్రవరాఖ్యుడు, ఉదయ్‌ కిరణ్‌ హీరోగా గుండె ఝల్లుమంది, మోహన్‌ బాబు ప్రధాన పాత్రలో ‘గాయత్రి’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదసంఘటన జరిగింది. రచయిత, దర్శకుడు మదన్‌ అనారోగ్యంతో కన్నుమూశారు. నాలుగు రోజుల క్రితం బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురైన ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుఝామున కన్నుమూశారు. మధ్యాహ్నం మదన్‌ అంత్యక్రియలు జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో ముగిశాయి.ప్రతిభావంతుడైన రచయిత, దర్శకుడు మదన్‌ మృతికి పలువురు చిత్ర ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.