సూపర్ స్టార్ మహేష్ బాబు రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరో అని నిరూపించుకున్న సందర్భాలు ఎన్ని ఉన్నాయో తెలిసిందే కదా. తను చేసే సేవా కార్యక్రమాల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇవన్నీ ఒకటైతే మహేష్ బాబు ఎంతోమంది చిన్నారులకు గుండె ఆపరేషన్ లు చేయించడం అనేది మరో ఎత్తు. ఒకటి కాదు రెండు కాదు ఇప్పటివరకూ వేయికి పైగా ఎంతోమంది చిన్నారి గుండెలకు మహేష్ ఆయువుపోశాడు. గత మూడేళ్ళ కాలంలో మహేష్ బాబు 1000 మంది చిన్నారులకు గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలని విజయవంతగా చేయించాడు. ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా మరో చిన్నారికి ప్రాణం పోసి తన సహృదయాన్ని చాటుకున్నారు. అది కూడా తను ఇంకా విషాదంలో ఉండగానే తన సేవాగుణాన్ని చాటడంతో అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మహేష్ బాబు తండ్రి కృష్ణ రెండు రోజుల క్రితమే స్వర్గస్తులైన సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో వారి కుటుంబం ఇంకా విషాదంలో ఉంది. మోక్షిత్ సాయి అనే చిన్నారికి మహేష్ బాబు హార్ట్ ఆపరేషన్ చేయించి అతని ప్రాణాల్ని నిలబెట్టాడు. అప్పటికే కృష్ణ పరిస్థితి విషమించడంతో బాధలో ఉన్న మహేష్ బాబు.. మోక్షిత్ ఆపరేషన్‌కి అవసరమైన ఏర్పాట్లు చేసి చికిత్స చేయించారు. దాంతో మహేష్ బాబు గొప్ప మనసుపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
కాగా ఈఏడాది సర్కారు వారి పాట సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు మహేష్. ఇక ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈసినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తుంది. దీనితో పాటు మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























