హీరో హీరోయిన్లపై రూమర్స్ రావడం అనేది గ్లామర్ ప్రపంచంలో చాలా ఈజీగా జరిగే పని. అందులోనూ ముఖ్యంగా వారి వ్యక్తిగత విషయాలపై అందరికీ ఇంకాస్త ఎక్కువగానే ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి.. ఏదైనా ఛాన్స్ దొరికితే చాలు వారి వ్యక్తిగత విషయాలపైనే రూమర్స్ పుట్టించేస్తుంటారు. ముఖ్యంగా వారి పెళ్లిళ్లపై పలు రూమర్లు వస్తుంటారు. ఇక సెలబ్రిటీలు కూడా వాటిపై స్పందిస్తూ క్లారిటీ ఇస్తుంటారు. ఇక గత కొద్దిరోజులుగా మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి గురించి కూడా పలు వార్తలు తెరపైకి వచ్చాయి. త్వరలోనే తమన్నా పెళ్లి పీటలు ఎక్కబోతోందంటూ.. ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్తను ఆమె పెళ్లి చేసుకోబోతోందన్న కథనాలు వచ్చాయి. అంతేకాదు ఈ కారణం వల్లే కొత్త సినిమాలను ఆమె అంగీకరించడం లేదని చెపుతున్నారు. త్వరలోనే పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని అన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఇప్పుడు ఈ వార్తలపై తమన్నా కూడా స్పందించి ఎపిక్ రిప్లై ఇచ్చింది. తనకు కాబోయే బినినెస్ హస్బెండ్ ఇతనే ఉంటూ తన ఇన్ట్సాలో ఒక ఫొటో పోస్ట్ చేసింది. ఈ ఫొటో ఎవరిదో కాదు.. ఎఫ్3 సినిమాలో మేల్ గెటప్ వేసిన సంగతిె తెలిసిందే కదా. ఆ ఫొటోనే తన ఇన్ట్సాలో పోస్ట్ చేసి రూమర్స్ కు కౌంటర్ ఇచ్చింది. మరి ఇంతటితో అయినా ఈ రూమర్లకు బ్రేక్ పడుతుందేమో చూద్దాం..

కాగా ప్రస్తుతం తమన్నా తెలుగులో చిరంజీవి భోళాశంకర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమా ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ఈసినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సంగీతం మహతి సాగర్.. సినిమాటోగ్రఫి డూడ్లే అందిస్తున్నారు. దీనితో పాటు తమిళ్ లో ఉంకా బాలీవుడ్ లో కూడా పలు ప్రాజెక్ట్ లు చేస్తూ కెరీర్ లో బిజీగా ఉంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























