కులగోత్రాలు (1961), పదండి ముందుకు (1962), పరువు ప్రతిష్ట (1963) చిత్రాలలో చిన్న చిన్న పాత్రలలో కనిపించిన కృష్ణ తేనెమనసులు (1965) చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు. సుమారు 5 దశాబ్దాల సినీ కెరీర్ లో 350 సినిమాలలో నటించిన కృష్ణ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా వెలుగొందారు. వెండితెరపై ఎన్నో ప్రయోగాలు, సాహసాలు చేస్తూ తిరుగులేని స్టార్‌డమ్‌ని సొంతం చేసుకున్నారు. మొట్టమొదటి సినిమా స్కోప్ (అల్లూరి సీతారామరాజు), మొట్టమొదటి ఈస్ట్‌మన్ కలర్ (ఈనాడు), మొట్టమొదటి 70ఎంఎం (సింహాసనం), మొట్టమొదటి కౌబాయ్ చిత్రం (మోసగాళ్లకు మోసగాడు) వంటి రికార్డ్స్ ను కృష్ణ క్రియేట్ చేశారు. హీరో , నిర్మాత , దర్శకుడు , స్టూడియో అధినేతగా కళామతల్లికి సేవలందించిన సూపర్ స్టార్ కృష్ణ ను కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఘట్ట మనేని కృష్ణ (79 ) తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 4.10 గంటలకు కాంటినెంటల్ ఆసుపత్రిలో కన్నుమూశారు. కార్డియాక్ అరెస్టుతో బాధపడుతున్న కృష్ణను కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కృష్ణ మంగళవారం ఉదయం కన్నుమూశారు.సూపర్ స్టార్ కృష్ణ మరణవార్త తెలిసిన సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలుపుతున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























