మొదటి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపును తెచ్చుకోవడమే కాకుండా డీసెంట్ హిట్ ను అందుకున్నాడు బెల్లంకొండ గణేష్. ఇక ఇప్పుడు రెండో సినిమాతో వచ్చేస్తున్నాడు. రాకీ ఉప్పలపాటీ దర్శకత్వంలో బెల్లంకొండ గణేష్ హీరోగా వస్తున్న సినిమా నేను స్టూడెంట్ సర్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకుంటూ పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకుంటుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ ను అప్పుడే స్టార్ట్ చేశారు మేకర్స్. దీనిలో భాగంగానే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
డైరెక్టర్ వినాయక్ చేతుల మీదుగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. తాను కొత్తగా కొన్న ఐ ఫోన్ పోయిందని … పోలీసులే దానిని కాజేశారని పోలీస్ స్టేషన్లో హీరో ఫిర్యాదు చేయడంపై ఈ టీజర్ మొదలవుతోంది. అతనిని ఎవరో ప్లాన్ చేసి రింగ్ లోకి నెట్టేసినట్టుగా హీరోతో సునీల్ చెబుతాడు. అతను చెప్పినట్టుగానే పోలీస్ ఆఫీసర్ సముద్రఖని హీరోను టార్గెట్ చేస్తాడు. దీనివల్ల హీరో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చింది అనేది ఈసినిమా అని అర్థమవుతుంది. చూద్దాం మరి ఈసినిమా గణేష్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































